Tejasvi Surya: దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీగా రికార్డు సృష్టించిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (BJP MP Tejasvi Surya) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. చెన్నైకు చెందిన ప్రముఖ గాయని, భరతనాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్ (Sivasri Skandaprasad)ను ఆయన పెళ్లి చేసుకున్నారు. బెంగళూరులో జరిగిన వీరి వివాహానికి కేంద్రమంత్రులు అర్జున్ రామ్ మేఘవాల్, వి. సోమన్న, భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
పెళ్లి ఫొటోలు వైరల్
తేజస్వీ – శివశ్రీ వివాహ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. వివాహానికి హాజరైన పలువురు భాజపా నేతలు పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులో పెళ్లి కూతురు శివశ్రీ.. పసుపు రంగు కాంచీపురం సిల్క్ చీరలో తళ తళా మెరిసిపోయింది. అటు ఎంపీ సైతం తెలుపు – బంగారు రంగు ఔట్ ఫిట్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. భారతీయ హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
बेंगलुरु दक्षिण से सांसद श्री @Tejasvi_Surya जी एवं संगीत गायिका, भरतनाट्यम की प्रसिद्ध कलाकार शिवश्री स्कंदप्रसाद जी के शुभ विवाह समारोह में सम्मिलित होकर नवदंपत्ति को उनके मंगलमय दांपत्य जीवन के लिए शुभकामनाएँ व आशीर्वाद प्रदान किया। pic.twitter.com/S7n531yxmn
— Arjun Ram Meghwal (@arjunrammeghwal) March 6, 2025
ప్రేమ వివాహం
తేజస్వీ – శివశ్రీ ఒకరినొకరు ప్రేమించుకొని ఈ వివాహం చేసుకున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తోంది. చెన్నైలో జరిగిన ఓ సంగీత కచేరిలో తొలిసారి శివశ్రీని తేజస్వీ చూశారని సమాచారం. ఆ తర్వాత 2022 ఎన్నికల ప్రచార సమయంలోనూ శివశ్రీ పాల్గొన్న ఈవెంట్ కు తేజస్వీ హాజరైనట్లు తెలుస్తోంది. ఆ సందర్భంలో ఏర్పడిన పరిచయం.. ఒకరితో ఒకరు జీవితాలను పంచుకునే స్థాయికి వెళ్లిందని సన్నిహితులు తెలియజేస్తున్నారు.
Also Read: Tamilisai Arrest: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై అరెస్టు.. ఎందుకంటే?
తేజస్వి పొలిటికల్ ప్రస్థానం
కర్ణాటకకు చెందిన తేజస్వీ సూర్య.. బెంగళూరు సౌత్ పార్లమెంటు స్థానం నుంచి వరుసగా రెండుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. భాజపా ఎంపీగా ఉండటంతో పాటు భారతీయ జనతా యువ మోర్చా (BJYM) ప్రెసిడెంట్ గా ఆయన వ్యవహరిస్తున్నారు. ఇక శివశ్రీ విషయానికి వస్తే ఆమె మద్రాస్ యూనివర్శిటీలో చదువుకుంది. ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాతో నేపథ్య గాయనిగా గుర్తింపు తెచ్చుకుంది. భరతనాట్యం, సంస్కృతంలో ఆమెకు మంచి ప్రావీణ్యం ఉంది.