BJP has already bagged Surat uncontested in lok sabha elections 2024:
దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాల కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్న వేళ..గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నియోజకవర్గం నుంచి ముందుగానే బీజేపీ బోణీ కొట్టింది. ఫలితాలకు ముందస్తుగానే నెల రోజుల క్రితమే బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ గుజరాత్ లోని సూరత్ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా గెలుపొందారు. మొదట కాంగ్రెస్ పార్టీ తరఫున సూరత్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నీలేష్ కుంభానీ తమ నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. ఆయన నామినేషన్ పత్రాలపై తాము సంతకం చేయలేదని ముగ్గురు ప్రతిపాదకులు ఎన్నికల అధికారికి అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తద్వారా నీలేష్ నామినేషన్‌ని ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో.. గుజరాత్ కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టైంది. బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్‌తో పాటు ఎన్నికల ఏజెంట్ దినేష్ జోధానీ అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత ఈ వివాదం తలెత్తింది. అటు.. కాంగ్రెస్ బ్యాకప్ అభ్యర్థి సురేష్ పద్సాలాకు కూడా ఇదే పరిస్థితి ఎదురవ్వడంతో, ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించబడటంతో పాటు ఇతర అభ్యర్థులు తమ నామినేషన్‌ని వెనక్కు తీసుకోవడం వల్లే.. ముఖేష్ దలాల్‌ని విన్నర్‌గా ప్రకటించడం జరిగింది.కాంగ్రెస్ పార్టీ తరఫున సూరత్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నీలేష్ కుంభానీ తమ నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. ఆయన నామినేషన్ పత్రాలపై తాము సంతకం చేయలేదని ముగ్గురు ప్రతిపాదకులు ఎన్నికల అధికారికి అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తద్వారా నీలేష్ నామినేషన్‌ని ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో.. గుజరాత్ కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టైంది. బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్‌తో పాటు ఎన్నికల ఏజెంట్ దినేష్ జోధానీ అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత ఈ వివాదం తలెత్తింది. అటు.. కాంగ్రెస్ బ్యాకప్ అభ్యర్థి సురేష్ పద్సాలాకు కూడా ఇదే పరిస్థితి ఎదురవ్వడంతో, ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
విజయ కమలాన్ని అందించిన ముఖేష్
ముఖేష్ దలాల్‌పై కాంగ్రెస్, బీఎస్పీ, మూడు చిన్నపార్టీలు అభ్యర్థులను నిలబెట్టాయి. స్వతంత్రులుగా నలుగురు బరిలో దిగారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన సోమవారం నాటికి దలాల్ ఒకరే మిగిలారు. దీంతో ముకేశ్ నెగ్గినట్లు జిల్లా ఎన్నికల అధికారి ధ్రువీకరణపత్రం అందించారు. ప్రధాని మోదీ చేతికి మొదటి ‘విజయ కమలా’న్ని అందించారంటూ గుజరాత్ భాజపా అధ్యక్షుడు సి.ఆర్.పాటిల్ తమ అభ్యర్థిని అభినందించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా స్పందించారు. భాజపా చరిత్రాత్మక విజయానికి నాంది పడిందని.. మోదీ నాయకత్వంలో గుజరాత్ సహా దేశవ్యాప్తంగా 400 స్థానాలతో కమలం విజయభేరీ మోగిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.
చరిత్రలో ఇంతవరకు 35 మంది
1951 నుంచి ఇప్పటివరకు 35 మంది అభ్యర్థులు లోక్‌సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 12 ఏళ్లలో మాత్రం ఎవరూ ఎన్నిక కాలేదు. బీజేపీ నుంచి ఇది తొలి ఏకగ్రీవంగా చెబుతున్నారు. గతంలో వై.బి.చవాన్, ఫరూక్ అబ్దుల్లా, హరేకృష్ణ మెహతాబ్, టి.టి.కృష్ణమాచారి, పి.ఎం.సయీద్, ఎస్.సి.జమీర్, డింపుల్ యాదవ్ వంటివారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా సూరత్‌లో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక ‘మ్యాచ్ ఫిక్సింగ్’ అని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రజాస్వామ్యం ముప్పులో పడిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. మన జీవితకాలంలో ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలని చెప్పారు.