BBC Services | భారత్‌లో బిబిసీ న్యూస్ రూం బంద్‌, రీజన్ అదేనట..!
BBC News Channel Has Closed Its News Room In India
జాతీయం

BBC Services: భారత్‌లో బీబీసీ న్యూస్ రూం బంద్‌, రీజన్ అదేనట..!

BBC News Channel Has Closed Its News Room In India: భారత్‌లో తన న్యూస్ రూమ్‌ను బీబీసీ సంస్థ మూసివేసింది.ఇన్‌కం ట్యాక్స్ శాఖ నాన్‌స్టాప్‌గా దాడులు, విచారణల అనంతరం ఈ డెసీషన్‌ తీసుకుంది. బీబీసీ యొక్క బ్రాడ్‌క్యాస్ట్‌ లైసెన్స్‌ను భారతీయ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి బదిలీ చేసినట్లు బీబీసీ అనౌన్స్‌ చేసింది. ఉద్యోగులతో కలెక్టివ్ న్యూస్ రూం పేరుతో దేశంలో బ్రాడ్‌క్యాస్ట్‌ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. పబ్లిషింగ్ లైసెన్స్‌ను మరో సంస్థకు అప్పగించడం తన హిస్టరీలో ఇదే తొలిసారి అని పేర్కొంది. జర్నలిజంలో రాజీపడబోమని బిబిసి క్లారిటీ ఇచ్చింది.

2002 గుజరాత్ మారణహోమంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ పాత్రను బట్టబయలు చేసిన ఇండియా: ది మోడీ క్వశ్చన్ అనే డాక్యుమెంటరీ టెలీకాస్ట్ అయిన తర్వాత ఢిల్లీ, ముంబైలలోని బిబిసి కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఆపై ఉల్లంఘనను గుర్తించి నోటీసులను జారీ చేసింది. గత ఫిబ్రవరిలో బిబిసి 2002 గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీని ప్రసారం చేసింది, అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆ డాక్యుమెంటరీ ప్రసారాన్ని నిషేధించింది.

Also Read: పాక్ టెర్రరిస్టులకు అర్థమయ్యే భాషలోనే..! భారత్‌ వ్యతిరేక ఆలోచన పుడితే చాలు.. !!

గుజరాత్ అల్లర్లలో ప్రధాని నరేంద్ర మోడీ పాత్రను నిక్కచ్చిగా వివరించిన డాక్యుమెంటరీ చాలా చర్చనీయాంశమైంది. ఏడాది కాలంగా ప్రతీకార చర్య కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీబీసీ భారత్‌లోని న్యూస్‌ రూమ్‌లను మూసివేయాలని డిసైడ్ అయింది. బిబిసి మే 1940లో భారత్‌లో ప్రసారాన్ని స్టార్ట్ చేసింది. హిందీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తమిళం మరియు తెలుగు భాషలలో బీబీసీ ఇండియా పనిచేస్తుంది. తాజా పరిణామాలతో బీబీసీ మూసివేతపై ఆయా పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నిస్తే ఆదాయపు పన్ను శాఖ వారు ఇంత దారుణానికి ఒడిగడుతారా అంటూ ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా ప్రశ్నించే గొంతుకను ఎందుకు ఇలా బెదిరింపులకు గురిచేస్తున్నారని వక్తలు ప్రశ్నిస్తున్నారు.

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!