Badrinath : ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ లో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పనులు చేస్తున్న 57 మంది కార్మికులపై ఒక్కసారిగా మంచు కొండలు విరిగిపడ్డాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం భారీగా మంచు పడుతోంది. దీంతో కొండల మీద దట్టంగా మంచు పేరుకుపోయింది. బద్రీనాథ్ జిల్లా థామ్ లోని బీఆర్ వో హైవే మీద కార్మికులు రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా.. పక్కనే ఉన్న మంచు కొండలు (icebergs) ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి.
మంచు చరియలు కార్మికుల మీద పడటంతో పోలీసులు, బీఆర్ వో (Bro) సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటికే 10 మందిని క్షేమంగా కాపాడారు. కానీ 47 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. మంచు దట్టంగా కురుస్తుండటంతో.. ఎంత మంచు తోడినా ఇంకా పేరుకుపోతూనే ఉంది. మనా గ్రామంలోని బీఆర్ ఓ క్యాంప్ కు అతిదగ్గర్లోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మంచు చరియల కింద చిక్కుకున్న వారంతా క్షేమంగా బయటపడాలని అంతా కోరుకుంటున్నారు.