జాతీయం

Mukhesh Ambani | ఆసియా ఖండంలో అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీ..!

Mukhesh Ambani | ఆసియా ఖండంలోని దేశాల్లో ఉన్న సంపన్నుల కుటుంబాల వివరాలను బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకటించింది. ఈ నివేదికలో మన ఇండియన్ కుబేరుడు ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో నిలిచాడు. ముఖేష్ అంబానీ కుటుంబం 90.5 బిలియన్ డాలర్ల సంపద అంటే ఇండియన్ కరెన్సీలో రూ.7.86 లక్షల కోట్లు కలిగి ఉందని ఈ నివేదిక తెలిపింది. ఆసియా ఖండంలో ఇప్పటికే చాలా సార్లు ఆయన మొదటి స్థానాన్ని సంపాదించుకున్నాడు. మధ్యలో ఆ నెంబర్ పోయినా.. మళ్లీ ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్నారు.

ఇక రెండో స్థానంలో థాయ్ లాండ్ కు చెందిన చీరోవనోండ్ 42.6 బిలియన్ డాలర్ల సంపద అంటే ఇండియన్ కరెన్సీలో రూ.3.70 లక్షల కోట్లు కలిగి ఉందని చెప్పింది. వరుసగా నాలుగు, ఏడు, తొమ్మిది స్థానాల్లో ఇండియాకు చెందిన మిస్త్రీ, జిందాల్, బిర్లా ఫ్యామిలీలు ఉన్నాయి. దాదాపు 20 కుటుంబాల పేర్లతో ఈ లిస్టులో డియాకు చెందిన నాలుగు కుటుంబాలు టాప్ –10లో ఉంటే.. బజాజ్, హిందూజా కుటుంబాలు కూడా చోటు దక్కించుకున్నాయి. అద్వానీ పేరు ఉంటుందని అంతా అనుకున్నా.. ఆయన పేరు ఎక్కడా లేకపోవడం గమనార్హం.

Just In

01

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం