Another Step Forward For India, The Success Of Agni-5 Missile
జాతీయం

INDIA : భారత్‌ మరో ముందడుగు,అగ్ని-5 క్షిపణి సక్సెస్

Another Step Forward For India, The Success Of Agni-5 Missile: రక్షణ రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. ఈ చారిత్రక నిర్ణయంతో మరోసారి చరిత్ర పుటల్లో నిలిచింది భారత్. బహుళ వార్‌షెడ్లను మోసుకెళ్లే అగ్ని-5 క్షిపణిని సోమవారం విజయవంతంగా ప్రయోగించారు. శత్రువుకు సంబంధించిన విభిన్న ప్రాంతాలపై ఏకకాలంలో విరుచుకుపడటానికి ఇది వీలు కల్పిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మిషన్ దివ్యాస్త్ర పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌లో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికిల్ పరిజ్ఞానాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ది సంస్థ (డీఆర్డీఓ) శాస్త్రవేత్తలు తొలిసారిగా పరీక్షించారు. దీంతో ఈ తరహా సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌, బ్రిటన్ వంటి దేశాల సరసన భారత్ మరోసారి నిలిచిందనే చెప్పాలి.

ఇక అగ్ని-5 ప్రయోగం గురించి శాస్త్రవేత్తల కృషిని అభినందిస్తూ భారత ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా అభినందించారు. ఇది చాలా ముఖ్యమైన మైలురాయి అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సైతం శాస్త్రవేత్తలను పొగిడారు. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్‌కలాం దీవి నుంచి ఈ క్షీపణి పరీక్ష జరిగింది. ప్రయోగానికి సంబంధించిన అన్ని లక్ష్యాలను నెరవేర్చినట్లు రక్షణశాఖ ప్రకటించింది. బహుళ రీఎంట్రీ వెహికిల్స్‌ని వివిధ టెలిమెట్రీ, రాడార్‌ కేంద్రాలు నిశితంగా పరిశీలించాయని తెలిపింది. మిషన్ దివ్యాస్త్రకు ఒక మహిళ శాస్త్రవేత్త నేతృత్వం వహించారు.

స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించిన క్షిపణుల్లో అగ్ని-5 అత్యంత శక్తివంతమైంది. 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ ఖండాంతర క్షిపణి చేధించగలదు. అణ్వస్ర్తాన్ని మోసుకెళుతుంది. ప్రధానంగా చైనాకి ఎదురయ్యే ముప్పులను తిప్పికొట్టేందుకు దీన్ని రూపొందించారు. ఆ దేశం మొత్తం దీని పరిధిలోకి వస్తుంది.

అగ్ని-5ని భారత్ గతంలో అనేకసార్లు పరీక్షించింది. అయితే ఎంఐఆర్‌వీతో ఈ అస్త్రాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి. సాధారణంగా ఒక క్షిపణి తన వాటర్‌హెడ్‌తో ఒక లక్ష్యం వైపు దాడి చేస్తుంది. ఎంఐఆర్‌వీ సాంకేతిక వల్ల ఒకే క్షిపణిలో బహుళ వార్‌షెడ్లను అమర్చవచ్చు. లక్ష్యానికి చేరువయ్యే క్రమంలో అవి.. ప్రధాన అస్త్రం నుంచి విడిపోతాయి. అనంతరం స్వతంత్రంగా వ్యవహరించగలవు. భిన్న వేగాల్లో భిన్న దిక్కుల్లో ట్రావెల్ చేయగలవు. వాటి ద్వారా ఏకకాలంలో లక్ష్యం వైపు దాడి చేయవచ్చు. లక్ష్యంగా ఎంచుకున్న ప్రదేశాల మధ్య దూరం వందల కిలోమీటర్లు ఉన్నా… ఇబ్బంది లేదు. 4-12 వార్‌హెడ్లను మోసుకెళ్లే అగ్ని-5ను తీర్చిదిద్దుతామని డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు తెలిపారు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం