AI Voice Clone Scam: ఏఐ వాడుకొని కజిన్ వాయిస్ క్లోన్ చేసి మోసం
Cyber-Fraud (Image source Twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

AI Voice Clone Scam: ఏఐ వాడుకొని కజిన్ వాయిస్ క్లోన్ చేసి.. కేటగాళ్లు చేసిన లేటెస్ట్ స్కామ్ ఇదే!

AI Voice Clone Scam: ఏఐ టెక్నాలజీతో (AI Technology) ఎన్నో ఉపయోగాలు దాగి ఉన్నాయి. ఈ దిశగా ఇప్పటికే ఎన్నో ఫలితాలు కూడా అందుతున్నాయి. అయితే, ఏఐ టెక్నాలజీని మోసాలకు కూడా పాల్పడే ఆస్కారం ఉందని హెచ్చరించే షాకింగ్ ఘటన ఒకటి తాజాగా వెలుగుచూసింది. ఏఐ ఆధారిత ‘వాయిస్-మాడ్యులేషన్’ సైబర్ మోసంగా భావిస్తున్న తొలి కేసు మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. ఇండోర్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళా టీచర్‌.. తన కజిన్‌తో ఫోన్ మాట్లాడానని భావించింది. మాట్లాడే విధానం, గొంతు కూడా అచ్చం అలాగే ఉండడంతో ఎలాంటి అనుమానం ఆమెకు కలగలేదు. అర్జెంట్ పని ఉందంటే ఏకంగా లక్ష రూపాయలు కూడా ట్రాన్స్‌ఫర్ కూడా చేసింది. కానీ, ఆ ఫోన్ మాట్లాడింది తన కజిన్‌తో కాదు. ఏఐ టెక్నాలజీ సాయంతో క్లోన్ చేసిన వాయిస్‌తో సైబర్ నేరగాళ్లతో (AI Voice Clone Scam) మాట్లాడానని తెలుసుకొని ఆమె అవాక్కయ్యింది. లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొత్త తరహా సైబర్ మోసాన్ని ఇండోర్ పోలీసులు గుర్తించారు. ఇండోర్‌కు చెందిన ఒక స్కూల్ టీచర్ సుమారుగా లక్ష రూపాయలు నష్టపోయింది. సైబర్ మోసగాళ్లు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఆమె కజిన్ వాయిస్‌ను క్లోన్ చేశారు. ఏమాత్రం అనుమానం రాకుండా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసే చక్కగా మాట్లాడారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. దీంతో, జరిగిన మోసం బయటపడింది.

Read Also- Ayodhya Ram Temple: షాకింగ్.. అయోధ్య రామమందిరంలో నమాజ్ చేసేందుకు కశ్మీరీ వ్యక్తి ప్రయత్నం

అసలేం జరిగిందంటే?

బాధితురాలి పేరు స్మిత. ఆమె మధ్యవయస్కురాలు. ఉత్తరప్రదేశ్ పోలీస్ ఎమర్జెన్సీ సర్వీస్‌లో పనిచేస్తున్న తన కజిన్‌తో ఆమె చివరిసారిగా రెండేళ్ల క్రితం మాట్లాడారు. జనవరి 6న అనుకోకుండా స్మితకు తన కజిన్ ఫోన్ నంబర్‌ను పోలిన నంబర్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తి అచ్చం తన కజిన్ లాగే మాట్లాడడంతో ఆమె నమ్మేశారు. తన ఫ్రెండ్‌కి హార్ట్ ఎటాక్ వచ్చిందని, ఇండోర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసరంగా సర్జరీ చేయాల్సి ఉందని నమ్మించాడు. అతడు పంపించిన క్యూఆర్ (QR) కోడ్‌లకు స్మిత మొత్తం నాలుగు విడతల్లో మొత్తం రూ. 97,500 ట్రాన్స్‌ఫర్ చేసింది. అయితే, తిరిగి కాల్ చేయడానికి ట్రై చేయగా నంబర్‌ బ్లాక్ చేసినట్టు గుర్తించింది. దీంతో, మరుసటి రోజు ఉదయం తన కజిన్‌కు ఫోన్ చేసి వివరాలు కనుక్కోగా, అతడు అసలు ఫోనే చేయలేదని కన్ఫార్మ్ అయ్యింది. దీంతో, ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Read Also- Minister Sridhar Babu: తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ క్యాపిటల్ చేయడమే మా లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు

సేమ్ టు సేమ్ వాయిస్

బాధితురాలికి వచ్చిన ఫోన్ కాల్‌లో వాయిస్ అచ్చం తన కజిన్ వాయిస్ మాదిరిగానే ఉందని బాధితురాలు వాపోయింది. కాగా, ఇది ఏఐ ఆధారిత వాయిస్ మాడ్యులేషన్ టెక్నాలజీని ఉపయోగించినట్లుగా ఉందని ఇండోర్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ (క్రైమ్) రాజేష్ దండోటియా మీడియాకు వెల్లడించారు. ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. కాగా, డిజిటల్ మోసాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, మధ్యప్రదేశ్‌లో గత నాలుగేళ్లలో భారీగా సైబర్ మోసాలు నమోదవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు కాజేసిన సొమ్ములో కేవలం 0.2 శాతం కంటే తక్కువగా రికవరీ అయ్యింది. 2021 మే 1 నుంచి 2025 జూలై 13 మధ్య జనాలు ఏకంగా రూ.1,054 కోట్లు సైబర్ మోసాల కారణంతో డబ్బు పోగొట్టుకున్నారు. అందులో కేవలం రూ.1.94 కోట్లు మాత్రమే రికవరీ అయ్యింది. ఇక, కేసుల విషయానికి వస్తే, మొత్తం 1,193 ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. అందులో కేవలం 585 కేసుల్లో మాత్రమే ఛార్జ్ షీట్లు దాఖలయ్యినట్టుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Just In

01

The RajaSaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ రెండో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

Audience Mindset: ప్రేక్షకులు సినిమా చూసే కోణం మారుతుందా?.. వారు ఏం కోరుకుంటున్నారు?

Anvesh Controversy: నా అన్వేష్ ఆడియో లీక్ చేసిన ఏయ్ జూడ్.. సనాతన ధర్మాన్ని అలా అన్నాడా?

Jana Sena: జనసేన ఊహించని నిర్ణయం.. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో పోటీకి సై

Ponguleti Srinivas Reddy: జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. గతం కంటే ఎక్కువ అక్రిడిటేషన్ కార్డులు