Ai
జాతీయం

Ai | రద్దీకి ‘ఏఐ చెక్’

Ai | న్యూఢిల్లీ, స్వేచ్ఛ : కుంభమేళా భక్తుల రద్దీ కారణంగా ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఇటీవల జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృత్యువాతపడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణపై భారతీయ రైల్వే ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయడంలో నిమగ్నమైంది. ప్రయాణికుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రైల్వే స్టేషన్లలో (railway stations) హోల్డింగ్ జోన్లు నిర్మించాలని భావిస్తోంది. రద్దీ నియంత్రణ, విపత్తు నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని (ai) కూడా వినియోగించుకోవాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా అత్యంత రద్దీగా 60 స్టేషన్లలో ఈ విధానాలను అమలు చేయనున్నారు. ఈ ప్రణాళికలపై సంబంధిత స్టేషన్ల అధికారులకు అవగాహన కల్పించనున్నారు. విపకత్తు నిర్వహణలో శిక్షణ ఇవ్వనున్నారని ఓ సీనియర్ అధికారి తెలిపారు. రద్దీ సమయాల్లో ప్రయాణికులు స్టేషన్‌లోకి ప్రవేశించినప్పుడు వారు ఎటువైపు వెళ్లాలనే విషయంలో అధికారులు సాయం చేస్తారు. నిర్దేశిత హోల్డింగ్ జోన్ల వైపు ప్రయాణికులు వెళ్లేలా బాణాల గుర్తులు, సెపరేటర్లతో మార్గం చూపిస్తారు. రైళ్లు ఆలస్యమైన సమయాల్లో ప్రయాణికుల కదలికలను పర్యవేక్షించేందుకు ఏఐ సాంకేతికతను రైల్వే అధికారులు ఉపయోగించనున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, మెట్ల ల్యాండింగ్ ప్రాంతాలపై కూర్చున్న వ్యక్తులను ఏఐ ఆధారిత కెమెరాలు పర్యవేక్షించి అలర్ట్ చేస్తాయని ఓ అధికారి చెప్పారు. ఒక్క న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోనే ఏకంగా 200 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి.

కుంభమేళా రైళ్లపై ప్రత్యేక దృష్టి

ఇటీవల తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే రైళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ప్రయాగ్‌రాజ్‌తో అనుసంధానించి ఉన్న 35 స్టేషన్లను ‘సెంట్రల్ వార్ రూమ్’ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. కుంభమేళాకు వెళ్లేవారిలో ఎక్కువ మంది ప్రయాగ్‌రాజ్‌కు చుట్టుపక్కల 300 కిలోమీటర్ల నుంచే ప్రయాణిస్తుండడంతో, ఆ ప్రాంతాల్లో రద్దీగా ఉంటున్న స్టేషన్లను మరింత జాగ్రత్తగా అధికారులు పరిశీలిస్తున్నారు. రద్దీకి సంబంధించిన సమస్యలను గుర్తించేందుకు రైల్వేశాఖ ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించనుందని, ప్రయాణికులతో పాటు కూలీలు, దుకాణదారుల నుంచి అభిప్రాయాన్ని సేకరించనున్నట్టు ఓ అధికారి వెల్లడించారు. ఇటీవల ప్రమాదం చోటుచేసుకున్న ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ముందస్తు జాగ్రత్తగా అదనపు పోలీసు బలగాలను మోహరించారు. స్టేషన్‌లోని వంతెనలపై సరైన కారణం లేకుండా ఎవరూ నిల్చోకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కొందరు ఏ కారణం లేకుండా చాలా సేపు వంతెనలపై నిల్చొని ఉంటున్నారని అధికారులు గుర్తించి ఈ ప్రకటన చేశారు.

Just In

01

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు