Ahmedabad Flight Crash: అహ్మాదాబద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం.. యావత్ దేశాన్ని శోక సంద్రంలోకి నెట్టిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఏకంగా 274 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 241 మంది ప్రయాణికులు ఉండగా.. విమానం ఓ బిల్డింగ్ పై కూలడంతో అందులోని 33 మంది మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ క్రమంలోనే మృతులకు సంబంధించిన విషాద గాదలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విమాన ప్రమాదంలో మరణించిన ఓ కుటుంబానికి సంబంధించిన విషయం వెలుగు చూసింది. అది గుండెలను కదిలించేస్తోంది. అ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
వివరాల్లోకి వెళ్తే..
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 37 ఏళ్ల జావేద్ అలీ సయ్యద్ (Javed Ali Syed) అతడి భార్య మరియమ్ (Mariam), ఐదేళ్ల కుమారుడు జాన్ అలీ సయ్యద్ (Zayn Ali Syed) (5), నాలుగేళ్ల కూతురు అమని అలీ సయ్యద్ (Amani Ali Syed) ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తన అన్న బాడీ కోసం అహ్మాదాబాద్ సివిల్ ఆస్పత్రికి వచ్చిన తమ్మడు ఇంతియాజ్ (Imtiaz).. హృదయ విదారక విషయాలను మీడియాతో పంచుకున్నారు. తన తల్లికి జావేద్ మరణించిన విషయం ఇంకా తెలియదని పేర్కొన్నారు. ఆమె హార్ట్ పెషంట్ అన్న ఇంతియాజ్.. త్వరలో సర్జరీ ఉన్నందున ఈ విషయాన్ని తన తల్లి వద్ద దాచినట్లు చెప్పారు. జావేద్ 11 ఏళ్ల క్రితం లండన్ వెళ్లి అక్కడే మరియమ్ ను కలిశాడని చెప్పారు. ప్రస్తుతం వారికి యూకే సిటిజన్ షిప్ కూడా ఉందని పేర్కొన్నారు.
15 ఏళ్ల తర్వాత రీ యూనియన్
అయితే జావేద్ ఇండియాకు రావడానికి ఓ బలమైన కారణముందని సోదరుడు ఇంతియాజ్ స్పష్టం చేశాడు. తాము మెుత్తం నలుగురు సోదరులమని.. ఇద్దరు సిస్టర్స్ కూడా ఉన్నారని తెలిపారు. తామంతా బక్రీద్ సందర్భంగా ఒకచోట చేరి తల్లితో పాటు పండగను సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అందరం 15 ఏళ్ల తర్వాత రీ యూనియన్ అవుతుండటంతో జావేద్ కూడా ఎంతో సంతోషంగా భార్య, పిల్లలతో ఇండియాకు వచ్చాడని పేర్కొన్నారు. ఈద్ పండగను ఎంతో సంతోషంగా జరుపుకున్నామని.. జావేద్ ఫ్యామిలీ చాలా ఆనందంగా గడిపిందని పేర్కొన్నారు. తిరిగి లండన్ కు తిరుగు ప్రయాణమైన సమయంలో ఈ దుర్ఘటన జరగడం.. తమను ఎంతో వేదనకు గురిచేస్తోందని ఇంతియాజ్ కన్నీటి పర్యంతమయ్యారు.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కాసేపట్లో సిట్ ముందుకు ప్రణీత్ రావు.. ఏం చెబుతారో!
మృతదేహాం కోసం ఎదురుచూపు
తన జావేద్ బాడీని తీసుకునేందుకు అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి (Ahmedabad Civil Hospital)కి వచ్చినట్లు ఇంతియాజ్ తెలిపారు. డీఎన్ఏ ఆధారంగా అన్న జావేద్ ను గుర్తించేందుకు వైద్యులకు తన రక్త నమూనాలను ఇచ్చినట్లు చెప్పారు. ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని అన్నారు. దీన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. డీఎన్ఏ రిపోర్ట్ వస్తేనే తన సోదరుడి బాడీ ఏదో చెప్పగలుగుతామని వైద్యులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఆదివారం నాటికి డీఎన్ఏ రిపోర్ట్ వస్తుందని చెప్పారు.
Also Read This: KTR on CM Revanth: లై డిటెక్టర్ టెస్టుకు రెడీ.. సీఎం రేవంత్ కూడా సిద్ధమా.. కేటీఆర్ సవాల్