TVK Party Symbol: విజయ్ టీవీకే పార్టీకి.. విజిల్ గుర్తు కేటాయింపు
Actor Vijay's TVK Gets Whistle Symbol
జాతీయం

TVK Party Symbol: విజయ్ టీవీకే పార్టీకి.. విజిల్ గుర్తు కేటాయింపు.. ఇక మోత మోగాల్సిందేనా!

TVK Party Symbol: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్టార్ హీరో విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీకి కేంద్రం జాతీయ ఎన్నికల సంఘం (National Election Commission) ‘విజిల్ గుర్తు’ (Whistle Symbol)ను కేటాయించింది. ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు అధికారిక చిహ్నాన్ని కేటాయిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.

కమల్ పార్టీకి ఏదంటే?

దేశం గర్వించతగ్గ నటుడు కమల్ హాసన్ (Kamal Hassan) స్థాపించిన మక్కల్ నీది మయ్యమ్ (MNM) పార్టీకి సైతం ఈసీ (EC) ఎన్నికల గుర్తును కేటాయించింది. ఎంఎన్ఎం అభ్యర్థులు పోటీ చేసేందుకు బ్యాటరీ టార్చ్ (Battery Torch)ను చిహ్నంగా రిజర్వ్ చేసింది. అయితే కమల్, విజయ్ పార్టీలకు కేటాయించిన చిహ్నాలను రాబోయే శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించబోమని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏ పార్టీ గానీ విజిల్, బ్యాటరీ టార్చ్ ను తమ పార్టీ గుర్తులుగా ప్రచారం చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

Also Read: TDP Cadre on YS Jagan: అసెంబ్లీకి రాడట.. కానీ పాదయాత్ర చేస్తాడట.. జగనన్న మీకిది తగునా!

రెండు రోజుల్లోనే..

సామాజిక న్యాయం – పారదర్శతతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించేందుకు టీవీకే అధినేత విజయ్.. చెన్నెలో ఎన్నికల ప్రచార కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం ఈ భేటి జరగ్గా.. ఇది జరిగిన రెండు రోజులకే ఈసీ పార్టీ గుర్తును ఖరారు చేయడం విశేషం. అంతకుముందు జనవరి 16న జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు 12 మంది సభ్యులు కలిగిన కమిటీని సైతం విజయ్ ఏర్పాటు చేయడం విశేషం.

Also Read: Medaram jatara 2026: భక్తులకు గుడ్ న్యూస్.. మేడారంలో హెలికాప్టర్ రైడ్స్.. ఒక్కొక్కరికి ఎంతంటే?

Just In

01

Davos Summit: తెలంగాణ రైజింగ్ 2047కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మద్ధతు

GHMC Elections: గ్రేటర్‌లో వేడెక్కిన రాజకీయం.. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే?

Illegal Admissions: ఇదెక్కడి విడ్డూరం.. 10వ తరగతి పూర్తవ్వకుండానే ఇంటర్ అడ్మిషన్లు!

Vijayasai Reddy: రాజకీయాలపై విజయసాయి రెడ్డి యూ-టర్న్.. సంచలన నిర్ణయం.. జగన్‌ కోర్టులో బంతి!

Arrive Alive Program: 100 మంది సర్పంచులతో ప్రతిజ్ఞ చేయించిన మెదక్ ఏఎస్పీ.. ఎందుకంటే