Plane Crash Reactions: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) దర్యాప్తు ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన ఘోర ప్రమాదం కావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని అధకారులు నిర్ణయించారు. ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ దీనిపై మాట్లాడుతూ, ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్, పలువురు అధికారులు అహ్మదాబాద్‌కు వెళ్తారని తెలిపారు.
దేశం వారికి తోడుగా ఉంటుంది: రాష్ట్రపతి
అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాదంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ‘‘విషయం తెలిసి చాలా బాధపడ్డాను. ఇది హృదయ విదారకమైన విపత్తు. నా ఆలోనలు, ప్రార్థనలు బాధితులతో ఉన్నాయి. వర్ణించలేని ఈ విషాద సమయంలో దేశం వారికి తోడుగా ఉంటుంది’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ప్రధాని మోదీ విచారం
విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘అహ్మదాబాద్‌లో జరిగిన విషాదం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది మాటల్లో చెప్పలేనం హృదయ విదారకంగా ఉంది. ఈ విచారకరమైన సమయంలో నా ఆలోచనలన్నీ బాధితులు, వారి కుటుంబ సభ్యులతోనే ఉన్నాయి. సహాయ చర్యలపై ఎప్పటికప్పుడు అధికారులు, స్థానిక నేతలతో మాట్లాడుతున్నా’’ అని మోదీ తెలిపారు.
రాహుల్ గాంధీ కీలక ప్రకటన
అహ్మదాబాద్ విమాన ఘటనపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, కాంగ్రెస్ కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వెంటనే సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. ‘‘ఎయిర్ ఇండియా ప్రమాదం హృదయ విదారకమైనది. ప్రయాణికులు, సిబ్బంది కుటుంబాలు అనుభవిస్తున్న బాధ, ఆందోళన ఊహించలేనిది. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు ప్రతి ఒక్కరితో ఉన్నాయి. అత్యవసరంగా రక్షణ, సహాయ చర్యలు చాలా ముఖ్యం. ప్రతి సెకను విలువైనది. కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సహాయం చేయడానికి తమ వంతు కృషి చేయాలి’’ అని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
Read Also- Air India Plane Crash: విమాన ప్రమాదంలో మాజీ సీఎం.. బంధువులు ఏమంటున్నారంటే
అహ్మదాబాద్ చేరుకున్న గుజరాత్ సీఎం
సీఎం భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్‌లోని అసర్వా సివిల్ ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ విమాన ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు. వారి పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
కెనడా హైకమిషన్ సంతాపం
అహ్మదాబాద్ ఘటనపై కెనడా హైకమిషన్ స్పందించింది. తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. ‘‘బాధితుల కుటుంబాలు, వారి ప్రియమైన వారితోనే మా ఆలోచనలు ఉన్నాయి’’ అని పేర్కొంది. వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది.
స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
ఎయిర్ ఇండియా ప్రమాదంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. ‘‘భారత్‌లో ప్రయాణికుల విమానం కూలిన విషయం తెలిసింది. ఈ విషాదకరమైన రోజున ప్రధాని మోదీ, భారతీయులకు నా ప్రగాఢ సానుభూతి. విమానంలో ఇండియా, యూకే, పోర్చుగల్, కెనడాకు చెందినవారు ఉన్నారని తెలిసింది. వారి కుటుంబ సభ్యుల బాధ తీర్చలేనిది. వీలైనంత ఎక్కువమంది ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నా. గాయపడిన వారు త్వరగ కోలుకోవాలి’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Read Also- Pakistan Water Crisis: పాక్‌లో మరింత ముదిరిన నీటి కష్టాలు.. ఖరీఫ్ సీజన్‌పై లోబోదిబో!