- కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్-గూడ్స్ రైలు ఢీ
- రంగపాని-నిజ్బారి స్టేషన్ల మధ్య ఉదయం 9గం. ప్రాంతంలో ఘటన
- ప్రమాదం ధాటికి గాల్లో లేచిన బోగీ
- ప్రమాదంలో 8 మంది మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం
- రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై రావడంతోనే ప్రమాదం!
- సిగ్నల్ పట్టించుకోకుండా వెళ్లిన గూడ్స్ రైలు?..
- అధికారికంగా ప్రకటించని రైల్వే శాఖ
- కొనసాగుతున్న సహాయక చర్యలు
- సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి
5 Dead..25 Injured After Goods Train Hits Kanchanjunga Express in Bengal:
పశ్చిమ బెంగాల్ లో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. న్యూజల్పాయ్ గురి వద్ద ఓ గూడ్స్ రైలు కాంచనజంగా ఎక్స్ ప్రెస్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో 8 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు జరుగుతున్నాయి.
ఉదయం 9 గంటలకు
అస్సాం సిల్చార్- కోల్‌కతా సీల్దా మధ్య కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్(13174) నడుస్తుంది. సోమవారం ఉదయం 9గం. ప్రాంతంలో న్యూ జల్‌పాయ్‌గురి రంగపాని-నిజ్బారి స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం ధాటికి రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఓ బోగీ గాల్లోకి లేచింది. మూడు బోగీల్లోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారమందుకున్న రైల్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై డార్జిలింగ్ అదనపు ఎస్పీ మాట్లాడారు. ఐదుగురు ప్రయాణికులు మృతిచెందారని, మరో 20-25 మంది గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఘటనపై సీఎం, రైల్వే మంత్రి దిగ్భ్రాంతి
ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలంలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎస్సీ, వైద్యులు, అంబులెన్స్‌లు, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే అక్కడకు చేరుకున్నాయన్నారు. అటు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీనిపై స్పందించారు. ఇది తీవ్ర దురదృష్టకర ఘటన అని విచారం వ్యక్తం చేశారు. సహాయకచర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.