Ladhak floods
జాతీయం

National:లద్దాక్ లో వరదల్లో చిక్కుకున్న భారత ఆర్మీ

గల్లంతయిన ఐదుగురు సైనికులు
నీటి ఉద్ధృతి పెరిగి మునిగిన టీ-72 ట్యాంక్‌
లద్దాఖ్‌ లోని వాస్తవాధీన రేఖ సమీపంలో ఘటన
మృతుల కోసం గాలిస్తున్న సైన్యం
ఒకరి మృత దేహం లభ్యం

5 Army personnel dead after tank sinks due to flash floods in Ladakh

చైనా సరిహద్దుల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ లోని వాస్తవాధీన రేఖ సమీపంలో గల న్యోమా-చుషుల్‌ ప్రాంతంలో భారత సైన్యం విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు గల్లంతయ్యారు. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విన్యాసాల్లో భాగంగా యద్ధ ట్యాంక్‌లతో నదిని దాటుతుండగా ఈ వరదలు సంభవించాయి. దీంతో నదిలో నీటి ఉద్ధృతి పెరిగి టీ-72 ట్యాంక్‌ మునిగిపోయింది. భారత ఆర్మీకి చెందిన యుద్ధ ట్యాంక్ టీ72.. ష్యోక్ అనే నదిని దాటుతుంది. సరిగ్గా నది మధ్యలోకి యుద్ధ ట్యాంక్ రాగానే.. నది నీటి మట్టం ఒక్కసారిగా.. అమాంతం పెరిగింది.

కొట్టుకుపోయిన జవాన్లు

ఆకస్మిక వరదలతో యుద్ధ ట్యాంక్ మునిగిపోయింది. అందులో ఐదుగురు జవాన్లు నదిలో కొట్టుకుపోయినట్లు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. వీరిలో జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి ఉన్నట్లు తెలుస్తోంది. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదాన్ని గుర్తించిన మిగతా జవాన్లు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గల్లంతు అయిన జవాన్ల కోసం గాలించగా.. ఒకరి మృతదేహం లభించిందని.. మరో నలుగురి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు సమాచారం.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?