Monday, July 1, 2024

Exclusive

NEET : నీట్ పరీక్ష.. నూరు అనుమానాలు

Many Doubts on NEET Exam : నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, అనంతర పరిణామాలపై నేడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం 2010 డిసెంబర్‌ 21న నాటి యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెస్ట్‌ టెస్ట్‌ (కామన్‌ ఎంట్రెస్ట్‌ టెస్ట్‌)ను నిర్వహించాలని నిర్ణయించింది. కాగా, అనేక కారణాలు చూపుతూ మోదీ పాలనలో ఉన్న గుజరాత్ మొదలు అనేక రాష్ట్రాలు అప్పట్లో దీనిని తిరస్కరించాయి. తర్వాత.. 2013 నుంచి 2016 మధ్యకాలంలో నీట్‌ పరీక్షా విధానం లోపభూయిష్టంగా ఉందని, ఇది కొన్ని భాషల, ప్రాంతాల విద్యార్థులకు నష్టం కలిగిస్తోందంటూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే, దేశవాప్తంగా ఒకే పరీక్ష వలన అన్ని ప్రాంతాల విద్యార్థులకు సమాన అవకాశాలు వచ్చే అవకాశం ఉందని, 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నందున అన్యాయం జరిగే అవకాశం లేదంటూ దేశంలోని రాష్ర్టాలన్నీ ‘నీట్‌’లో జాయిన్‌ కావాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. సుప్రీంకోర్టు చెప్పినట్లుగా ‘ఆల్‌ ఇండియా పూల్‌’ ద్వారా తెలంగాణ విద్యార్థులకు ఎంతోకొంత మేలు జరుగుందని అప్పట్లో అందరూ భావించారు.

అయితే, నీట్ పరీక్ష వల్ల మొత్తంగా తెలంగాణకు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగిందని గత ఆరేళ్ల అనుభవాలను బట్టి అర్థమవుతోంది. 2017 నుంచి తెలంగాణ విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణ నుంచి ఈ పరీక్షకు 1.4 లక్షలమంది విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణలో 54 మెడికల్ కాలేజీలుండగా, అందులో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 27. రాష్ట్రంలోని మొత్తం మెడికల్ సీట్ల సంఖ్య 8,265 కాగా, అందులో ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న సీట్లు 3,815 మాత్రమే. అయితే వీటిలో 15 శాతం సీట్లు.. ‘ఆల్‌ ఇండియా పూల్‌’ కోటా కింద ఇతర రాష్ట్రాల విద్యార్థులకు పోతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 30 పీజీ వైద్య కళాశాలుండగా అందులో ప్రభుత్వ కళాశాలల సంఖ్య 10 మాత్రమే. మొత్తం కళాశాలల్లో 2,978 సీట్లుండగా, ప్రభుత్వ కళాశాలల్లోని సీట్లు 1,267 మాత్రమే. వీటిలో సగం సీట్లను ‘ఆల్‌ ఇండియా పూల్‌’ కోటా కింద తెలంగాణ విద్యార్థులు కోల్పోతున్నారు. అయితే, ఇక్కడి సీట్లు వేరే రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించినట్లే, వేరే రాష్ట్రాల సీట్లు ఆల్ ఇండియా పూల్ కింద ఉంటున్న సీట్ల వల్ల తెలంగాణ విద్యార్థులకు మేలు జరగటం లేదు. ఎందుకంటే తెలంగాణలోని కాలేజీల్లోని మెరుగైన సౌకర్యాల వల్ల బయటి రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడి కాలేజీల్లో టక్కున చేరిపోతుండగా, కనీస సౌకర్యాలు లేని బయటి రాష్ట్రాల మెడికల్ కళాశాలలో సీటొచ్చినా, తెలంగాణ విద్యార్థులు చేరటం లేదు. దీనికి తోడు, ఆర్టికల్‌ 371-డి ప్రకారం బయటి రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదవిన తెలంగాణ విద్యార్థి.. సొంత రాష్ట్రమైన తెలంగాణలో నాన్‌లోకల్‌గానే పరిగణించబడుతున్నాడు. దీంతో బయటి రాష్ట్రపు కాలేజీ సంగతే ఇక్కడి విద్యార్థులు మరిచిపోవాల్సిన దుస్థితి.

దేశవ్యాప్తంగా 2018 నాటికి 499 మెడికల్‌ కాలేజీలు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 706 అయింది. 2018తో దేశంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 70,012 కాగా, ప్రస్తుతం అది 1,08,940 సీట్లకు పెరిగింది. అయితే, మొత్తం కాలేజీల్లో 270 కాలేజీలు దక్షిణాదిలోని 5 రాష్ట్రాలకు చెందినవే. వీటిలో 43,525 సీట్లున్నాయి. అంటే.. 23 రాష్ట్రాల్లో కాలేజీల సంఖ్య 436 మాత్రమే కాగా వీటిలోని సీట్లు 65,415 మాత్రమే. దక్షిణాదిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నాలుగైదేళ్లకోసారి కొత్త మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తూ రావటంతో ఇక్కడ మెడికల్ సీట్ల సంఖ్య పెరుగుతోంది. అయితే, ఈ రాష్ట్రాల్లో నీట్‌ రాసే విద్యార్థుల సంఖ్య మాత్రం పెద్దగా పెరగలేదు. 2018లో 5 దక్షిణాది రాష్ట్రాల నుంచి 4,24,523 మంది నీట్‌కు హాజరుకాగా.. 2024 నాటికి ఆ సంఖ్య 5,82,845కు చేరింది. అంటే.. ఏడేళ్లలో 1,58,322 మంది విద్యార్థులే పెరిగారు. దీనికి భిన్నంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ల నుంచి నీట్‌ రాసే విద్యార్థుల సంఖ్య ఏటా వేగంగా పెరుగుతోంది. ఈ 6 రాష్ర్టాల నుంచి 2018లో 4,78,255 మంది విద్యార్థులు నీట్‌కు హాజరుకాగా.. 2024లో ఈ సంఖ్య 11,57,180కు చేరింది. ఈ లెక్కలను బట్టి ఉత్తరాదిలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నదే తప్ప కళాశాలల సంఖ్య పెరగడం లేదు. దీంతో వీరంతా దక్షిణాది కాలేజీల మీద ఆధారపడుతున్నారు. దీంతో ఇక్కడి విద్యార్థులకు నష్టం జరుగుతోంది.

దేశంలో కేంద్రీకృత విధానంలో కీలక పరీక్షలు నిర్వహించటమూ సమస్యలకు దారితీస్తోంది. ముఖ్యంగా ఎక్కడో బీహార్‌లో పేపర్ లీక్ అయితే, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఇబ్బంది పడక తప్పని పరిస్థితి. మనదేశంలో నీట్‌-యూజీ, జేఇఇ, యూజీసీ-నెట్‌, సీయూఈటీ వంటి సుమారు 15 ప్రధాన పరీక్షలు నేటికీ అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల సేవల మీద ఆధారపడే జరుగుతున్నాయి. సిబ్బంది, ఐటీ సిస్టమ్‌లు, క్యూఆర్‌ కోడ్స్ వంటి పనులన్నీ ఏజెన్సీల మనుషులే చేస్తున్నారు. ఇటీవల లీకయిన నీట్ ప్రశ్నాపత్రం తాలూకూ విచారణలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటికొచ్చాయి. అహ్మదాబాద్‌ నుంచి ఓ ప్రైవేటు కొరియర్‌ సంస్థ ద్వారా రాంచీకి నీట్ ప్రశ్నపత్రాలు వచ్చాయి. వాటిని అక్కణ్నుంచి స్థానిక ఎస్‌బీఐ బ్రాంచ్‌కి చేర్చి, తర్వాత బ్యాంకు నుంచి ఎగ్జామ్‌ సెంటర్‌కు చేర్చాల్సి ఉంది. అయితే, సదరు కొరియర్ కంపెనీ రాంచీకి వచ్చిన ప్రశ్నపత్రాలను తన సొంత వాహనంలో తీసుకుపోవాల్సింది పోయి.. ఆ సమయానికి అక్కడ కనిపించిన ఈ-రిక్షాను బుక్‌ చేసింది. ఇక పరీక్ష మీద థర్డ్‌ పార్టీ చేసిన రివ్యూలో అనేక లోపాలు బయటపడ్డాయి. అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 4 వేల కేంద్రాల్లో నీట్‌ పరీక్ష జరగగా, వీటిలో 399 కేంద్రాల్లో ఈ సర్వే జరిగింది. నిబంధనల ప్రకారం.. ప్రతి పరీక్ష కేంద్రపు గదిలో రెండు సీసీ కెమెరాలుండటంతో బాటు వీటిని ఢిల్లీలోని ఎన్‌టీఏ ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేయాలి. కానీ, ఈ సర్వేలో 399 సెంటర్లకు గాను 186 కేంద్రాల్లోని (46%) తరగతి గదుల్లో సీసీ కెమెరాలు పనిచేయలేదు. అలాగే, 68 కేంద్రాల్లో ప్రశ్నపత్రాలు భద్రపరచే స్ట్రాంగ్‌ రూములకు ఎలాంటి గార్డుల కాపలా లేదు. 83 కేంద్రాల్లో.. ఉండాల్సిన బయోమెట్రిక్‌ సిబ్బందికి బదులుగా వేరే వ్యక్తులు ఉన్నట్టు గుర్తించారు.

ఇంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా నీట్ పరీక్షను ఆన్‌లైన్‌లో ఎందుకు నిర్వహించటం లేదు? ఏదైనా తప్పు చేసి బ్లాక్‌లిస్టులోకి చేరిన ఔట్ సోర్సింగ్ పరీక్ష నిర్వహణా సంస్థల మీద నామ మాత్రపు చర్యలే గాక మళ్లీ మళ్లీ వారికే పరీక్ష నిర్వహించే బాధ్యతలు ఎలా దక్కుతున్నాయి? విద్యార్థులు తాము నివాసం ఉండే చోటు కాకుండా విసిరేసినట్లుండే ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాలను ఎంచుకోవటం, అక్కడి కేంద్రాల్లో రాసిన అందరికీ అత్యధిక మార్కులు వస్తున్నా.. ఇన్నాళ్లూ అధికారులు పట్టించుకోలేదెందుకు? ఇంత పెద్ద వైఫల్యం మీద దేశ ప్రధాని మొదలు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు నోరు మెదపలేకపోవటానికి కారణాలేమి? ఇలా.. వందల ప్రశ్నలు నేడు విద్యార్థుల మెదళ్లను తొలిచేస్తున్నాయి. ఇదే సమయంలో ‘ఆల్‌ ఇండియా పూల్‌’ భ్రమలను పక్కనబెట్టి ఆయా రాష్ట్రాలు గతంలో మాదిరిగా స్వయంగా ఇలాంటి పరీక్షలు నిర్వహించుకోవటమే మంచిదనే సూచనలు విద్యావేత్తల నుంచి వినిపిస్తున్నాయి.

Publisher : Swetcha Daily

Latest

Minister: అమాత్యయోగం ఎవరికో?

- త్వరలో మంత్రివర్గ విస్తరణ - ఉత్కంఠలో ఆశావహులు - ఆషాడానికి ముందే మహూర్తం? -...

Survey: చదువుల కంటే పెళ్లికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారుగా..!

Indian Weddings: మన దేశంలో పిల్లల చదువుల కంటే.. వారి పెళ్లికి...

Criminal Law: కొత్త పోలీసు చట్టాలు

- దేశవ్యాప్తంగా అమలుకు రంగం సిద్ధం - కేసుల సత్వర విచారణే లక్ష్యం -...

Job Calender: త్వరలో జాబ్ క్యాలెండర్

- అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు - కొలువుల జాతర కొనసాగుతుంది - కాంగ్రెస్...

PM Narendra Modi: అబద్ధాల్లో మోదీని మించారే..

- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కూనంనేని ఫైర్ - ‘సింగరేణి ప్రైవేటుపరం చేయడానికి...

Don't miss

Minister: అమాత్యయోగం ఎవరికో?

- త్వరలో మంత్రివర్గ విస్తరణ - ఉత్కంఠలో ఆశావహులు - ఆషాడానికి ముందే మహూర్తం? -...

Survey: చదువుల కంటే పెళ్లికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారుగా..!

Indian Weddings: మన దేశంలో పిల్లల చదువుల కంటే.. వారి పెళ్లికి...

Criminal Law: కొత్త పోలీసు చట్టాలు

- దేశవ్యాప్తంగా అమలుకు రంగం సిద్ధం - కేసుల సత్వర విచారణే లక్ష్యం -...

Job Calender: త్వరలో జాబ్ క్యాలెండర్

- అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు - కొలువుల జాతర కొనసాగుతుంది - కాంగ్రెస్...

PM Narendra Modi: అబద్ధాల్లో మోదీని మించారే..

- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కూనంనేని ఫైర్ - ‘సింగరేణి ప్రైవేటుపరం చేయడానికి...

PM Pranaam: పీఎం ప్రణామ్ ప్రయోగం ఫలించేనా..?

Will The PM Pranam Experiment Work: దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావంతో మంచి వానలు కురుస్తున్న వేళ.. రైతాంగం ఖరీఫ్ పనుల్లో రైతాంగం బిజీబిజీగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన...

Local Parties: ప్రాంతీయ పార్టీలపై చిన్నచూపెందుకు?

Regional Parties To Underestimate: దేశంలో కొత్తగా కొలువుదీరిన ఎన్డీయే ప్రభుత్వంలో మరోసారి ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించనున్నాయి. గత పదేళ్ల కాలంలో కేంద్రంలో బీజేపీ మాట చెల్లుబాటవుతూ రావటంతో ప్రాంతీయ...

Politics: తెలంగాణలో రంగులు మారుతున్న రాజకీయం

Defections: రాజకీయాలు, పదవులు అంటే బాధ్యత. సేవ అనే దృక్పథం నుండి అవకాశం. కానీ, అధికారం అనే భావనగా నాయకుల వ్యవహార శైలి మారిపోయింది. రాష్ట్రం, పార్టీ అనే తేడా లేకుండా నాయకులు...