Tuesday, July 2, 2024

Exclusive

PM Pranaam: పీఎం ప్రణామ్ ప్రయోగం ఫలించేనా..?

Will The PM Pranam Experiment Work: దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావంతో మంచి వానలు కురుస్తున్న వేళ.. రైతాంగం ఖరీఫ్ పనుల్లో రైతాంగం బిజీబిజీగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ప్రమోషన్‌ ఆఫ్‌ ఆల్టర్నేట్‌ న్యూట్రియంట్స్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ మేనేజ్‌మెంట్‌ (పీఎం-ప్రణామ్‌) పథకం గురించి ఇప్పుడు రైతాంగంలో చర్చ జరుగుతోంది. దేశంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడంతో బాటు రసాయన ఎరువులపై సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడానికి ఈ పథకం ఉపయోగపడనుందని కేంద్రం చెబుతోంది. మనదేశంలో ప్రస్తుత ఎరువుల సబ్సిడీ రూ.2.5 లక్షల కోట్లకు చేరింది. ఇది కేంద్ర బడ్జెట్‌ను దెబ్బతీస్తోందని, అందుకే రసాయనిక ఎరువుల వినియోగం తగ్గేలా పర్యావరణ అనుకూలమైన సేంద్రియ సాగు విధానాల వైపు రైతులను ప్రోత్సహిస్తే అటు ఆర్థిక భారం తగ్గటంతో బాటు భూసారమూ పెరుగుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ పథకం ద్వారా సుమారు 50 శాతం సబ్సిడీ భారం తగ్గనుందని, దీనివల్ల ఆ మిగులు నిధులను రాష్ట్రాలలో పలు అభివృద్ధి పనులకు వాడుకోవచ్చని కేంద్ర ఎరువుల, రసాయనాల మంత్రిత్వ శాఖ లెక్కలు వేస్తోంది. అయితే, ఈ పథకం అమలు, దీని పర్యవసానాలు మీద రైతాంగం వైపు నుంచి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఎలాంటి నిధులూ కేటాయించదు. కేవలం ఇప్పుడిస్తున్న సబ్సిడీలను సగానికి కోతపెట్టి, ఆ ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు గ్రాంట్‌గా అందించనున్నారు. ఈ గ్రాంట్‌లో 70 శాతం నిధులను గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిల్లో ప్రత్యామ్నాయ ఎరువులు, ప్రత్యామ్నాయ ఎరువుల ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు వినియోగించొచ్చని, మిగిలిన 30 శాతం మొత్తాన్ని రసాయన ఎరువుల వాడకం తగ్గింపుపై రైతుల్లో అవగాహన కల్పించిన పంచాయతీలకు, రైతు సంఘాలకు, స్వయం సహాయక సంఘాలకు బహుమతులు ఇవ్వడానికి, ఇతర ప్రోత్సాహకాలకు ఉపయోగించుకోవచ్చు. ఒక సంవత్సరంలో రసాయనిక ఎరువుల వినియోగంలో రాష్ట్రం పెరుగుదల లేదా తగ్గుదలకు, గత 3 సంవత్సరాలలో దాని సగటు వినియోగానికి మధ్య తేడా చూపించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎరువుల మంత్రిత్వ శాఖకు డ్యాష్ బోర్డు అయిన ఐ.ఎఫ్.ఎం.ఎస్ ను ఉపయోగించి ప్రభుత్వం దీన్నినిర్వహిస్తుంది.

మనదేశంలో రసాయన ఎరువుల వాడకం ప్రతి ఏటా విపరీతంగా పెరిగిపోతోంది. 2017-18లో వినియోగం 5.28 కోట్ల మెట్రిక్‌ టన్నులు కాగా, 2021-22 నాటికి 6.40 కోట్ల మెట్రిక్‌ టన్నులకు (21శాతం) పెరిగింది. ఇందులో యూరియా వినియోగం 2017-18లో 2.98 కోట్ల మెట్రిక్‌ టన్నుల నుంచి 2021-22 నాటికి ఏకంగా 3.56 కోట్ల మెట్రిక్‌ టన్నులకు (19.64 శాతం) చేరుకుంది. అలాగే డీఏపీ వినియోగం 98.77 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 1.23 కోట్ల మెట్రిక్‌ టన్నులకు (25.44 శాతం) పెరిగింది. ఇక.. 2020-21లో సబ్సిడీల భారం రూ.1.27 లక్షల కోట్లు కాగా, 2021-22 నాటికి రూ.1.62 లక్షల కోట్లకు చేరింది. 2022-23 నాటికి ఇది సుమారు రూ.2.5 లక్షల కోట్లకు చేరింది. మరోవైపు, ప్రస్తుతం ఎరువుల దిగుమతుల్లో భారత్‌ ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉంది. దేశంలో నానాటికీ పెరుగుతున్న సాగు పెరగటం, డిమాండుకు తగినంతగా ఎరువుల ఉత్పత్తికి అవసరమైనంతగా ముడిపదార్థాలు అవసరం లేకపోవటం వలన దిగుమతులు అనివార్యమవుతున్నాయి. దీనికి తోడు యుద్ధాలు, ప్రకృతి ఉత్పాతాల వంటి సమయాల్లో ఈ ఎరువుల దిగుమతి కష్టంగా మారటంతో.. ఈ సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా, బడ్జెట్‌పై భారం పడకుండా వివిధ దేశాలతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇదే సమయంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ సేంద్రియ ఎరువులను పెంచే ప్రయత్నా్న్ని సమాంతరంగా అమలు చేస్తోంది.

Also Read: ప్రాంతీయ పార్టీలపై చిన్నచూపెందుకు?

దేశంలో ఎరువుల సగటు వాడకం ఎకరాకు 75 కిలోలుగా ఉండగా, విదేశాల్లో అది 200 కిలోలుగా ఉంది. దేశంలో ఏటా 272.28 లక్షల టన్నుల నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను వాడుతున్నారు. దేశంలో మన రైతులు 1.19 కోట్ల టన్నుల డీఏపీ వాడుతుండగా, అందులో 60 లక్షలు దిగుమతి చేసుకుంటున్నాం. ఇక.. చైనా, ఒమన్, యుఎఇ, ఈజిప్టు, ఉక్రెయిన్ నుంచి 10.16 మిలియన్ టన్నుల యూరియాను దిగుమతి చేసుకున్నాము. మొత్తంగా మన దేశంలో ఏడాదికి రూ. 73 లక్షల కోట్ల విలువైన ఎరువుల వినియోగముండగా, సొంత ఎరువుల కంపెనీలు లేకపోవటంతో మొత్తం వినియోగించే ఎరువులో కేవలం సగం కంటే తక్కువే ఇక్కడ ఉత్పత్తి అవుతోంది. దీంతో ఏటా 1.3 కోట్ల టన్నుల ఎరువులను మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దేశీయ ఉత్పత్తిలో 30 శాతానికి పైగా గుజరాత్‌లో ఉన్న కంపెనీలే ఉత్పత్తి చేస్తున్నాయి. దీని విలువ 6.32 బిలియన్ల యుఎస్ డాలర్లు.

2010 వరకు ఎరువుల ధరలను కేంద్ర ప్రభుత్వమే ప్రకటించేది. కంపెనీల ప్రయోజనాల కోసం 2011లో ధరల నిర్ణయం నుంచి కేంద్రం వైదొలిగి ఎరువుల కంపెనీలకే అధికారం ఇచ్చింది. దీంతో 2011లో రూ. 350 గా ఉన్న డీఏపీ ఎరువు బస్తా నేడు రూ. 1750 లకు పెరిగింది. ధరల పెరుగుదల వల్ల సబ్సిడీ పెరిగినా, దాని ప్రయోజనం రైతులకు గాకుండా ఎరువుల కంపెనీలకే చేకూరింది. దిగుమతి చేసుకున్న యూరియాపై 2019- 20 ఆర్థిక సంవత్సరంలో రూ. 53,619 కోట్ల సబ్సిడీని విదేశీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం చెల్లించింది. ఇది కాకుండా భాస్వరం, పొటాష్‌లకు రూ. 26,335 కోట్లు చెల్లించింది. మోడీ ప్రభుత్వం 2014 నుంచి 2022 వరకు ఎరువుల సబ్సిడీల పేరిట ప్రైవేట్ కంపెనీలకు చెల్లించిన మొత్తం రూ. 9,52,,878 కోట్లు. ఇందులో గుజరాత్‌లోని అనుయాయుల ఎరువుల కంపెనీలకు సబ్సిడీ రూపంలో ఇచ్చింది రూ. 2,85,863 కోట్లు. మరోవైపు, ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో ఎరువుల ముడి సరుకుల ధరల గణనీయంగా తగ్గాయి. 2022లో 900 డాలర్లు ఉన్న టన్ను అమ్మోనియా ధర 2023 మార్చి 460 డాలర్లకు, అదే సంవత్సరాల్లో ఫాస్ఫరిక్ యాసిడ్ ధర 1300 నుంచి 1020 డాలర్లు, యూరియా 680 నుంచి 340 డాలర్లకు తగ్గటం జరిగింది. ఆ మేరకు ప్రభుత్వం చెల్లించే సబ్సిడీ కూడా తగ్గటం వలన ఎరువుల విక్రయ ధరలు కూడా తగ్గాలి. కానీ, దేశంలో ఎరువుల ధరలు యథాతథంగా ఉన్నాయి. తగ్గిన ఎరువుల సబ్సిడీని వాటి ధరల తగ్గే విధంగా వినియోగించ కుండా మోదీ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంది. ఫలితంగా రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది.

2008లో భూటాన్ శ్రీలంక సేంద్రియ వ్యవసాయానికి మారింది. అయితే, అది దశల వారీగా ఈ విధానంలోకి మారటం వల్ల అక్కడ మంచి ఫలితాలే వచ్చాయి. అదే బాటలో 2020లో శ్రీలంక పయనించింది. రసాయన ఎరువులు తగ్గించి, ఒక్కసారిగా సేంద్రియ వ్యవసాయంలోకి మారటంతో అక్కడ ఆహార ఉత్పత్తి తగ్గిపోయి 2021 దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. మరోవైపు సేంద్రియ వ్యవసాయానికి సాధారణంగా మూడేళ్ల కంటే ఎక్కువ సమయమే పడుతుందనీ, అది కూడా ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్న వేళ.. ఎలాంటి కసరత్తు లేకుండా మన దేశ రైతాంగపు ఎరువుల సబ్సిడీలో కోతపెట్టి, వారిని ప్రయోగాల బాట పట్టించటం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయేమోనని మన దేశ వ్యవసాయ రంగ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. మన రైతుల్లో 95 శాతం చిన్న, సన్నకారు రైతులే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ రైతాంగం మీద ఇలాంటి ప్రయోగాలు చేసే బదులు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా కొన్ని రాష్ట్రాల్లోని గుర్తించిన ప్రాంతాలలో అమలు చేయటం మంచిదని వారు సూచిస్తున్నారు. ఇకనైనా కేంద్రం వారి అభిప్రాయలను గుర్తించి, అన్ని విధాలుగా ఆలోచించి పీఎం ప్రణామ్ పథకానికి మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది.

Publisher : Swetcha Daily

Latest

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి...

PM Narendra Modi: రాహుల్ గాంధీలా చేయొద్దు!

- ప్రధాని కుర్చీని దశాబ్దాల పాటు ఒకే కుటుంబం పాలించింది - మ్యూజియంలో...

Cabinet Expansion: 4న మంత్రివర్గ విస్తరణ

- కొత్తగా నలుగురికి అవకాశం - సామాజిక సమీకరణాలే కీలకం - మంత్రుల శాఖల్లో...

Don't miss

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి...

PM Narendra Modi: రాహుల్ గాంధీలా చేయొద్దు!

- ప్రధాని కుర్చీని దశాబ్దాల పాటు ఒకే కుటుంబం పాలించింది - మ్యూజియంలో...

Cabinet Expansion: 4న మంత్రివర్గ విస్తరణ

- కొత్తగా నలుగురికి అవకాశం - సామాజిక సమీకరణాలే కీలకం - మంత్రుల శాఖల్లో...

TS Governance: పాలనపై ముద్రకు రేవంత్ ముందడుగు

CM Revanth Steps Forward To Impress Upon The Regime: తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించి రేపటికి నిండా ఏడు నెలలు పూర్తవుతాయి. ప్రభుత్వం ఏర్పడి, మంత్రులంతా...

Fuel Sources: ప్రత్యామ్నాయ ఇంధన వనరులే శరణ్యం

Alternative Energy Sources Are The Refuge: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పారిశ్రామికీకరణ, ఆధునిక జీవన విధానం కారణంగా మానవుని ఇంధన అవసరాలు నానాటికీ పెరుగుతున్నాయి. అయితే, అవసరాలే ప్రాతిపదికగా యథేచ్ఛగా ఇంధన వనరులను...

Local Parties: ప్రాంతీయ పార్టీలపై చిన్నచూపెందుకు?

Regional Parties To Underestimate: దేశంలో కొత్తగా కొలువుదీరిన ఎన్డీయే ప్రభుత్వంలో మరోసారి ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించనున్నాయి. గత పదేళ్ల కాలంలో కేంద్రంలో బీజేపీ మాట చెల్లుబాటవుతూ రావటంతో ప్రాంతీయ...