Health Tips: ఉదయం అన్నం తింటున్నారా?
rice ( Image Source: Twitter)
లైఫ్ స్టైల్

Health Tips: బ్రేక్‌ఫాస్ట్‌కి అన్నం.. నిజంగా మంచిదేనా? డాక్టర్ల హెచ్చరిక ఇదే!

Health Tips: అన్నం మన ఆహారంలో ప్రధానమైనది. తింటే తక్షణమే శక్తిని ఇస్తుంది. అలాగే, జీర్ణం సులభంగా అవుతుంది. మజ్జిగ అన్నం వంటి వంటకాలు ఆరోగ్యానికి మంచివే. విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్, ఖనిజాలు అన్నంలో బాగా లభిస్తాయి. అయినా కూడా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా అన్నం తినడం మాత్రం వైద్యుల ప్రకారం అంత మంచిది కాదు.

Also Read: Lenskart B: లెన్‌స్కార్ట్ నుంచి సరికొత్త కళ్లజోళ్లు.. యూపీఐ పేమెంట్స్, ఫొటోలు, వీడియోల చిత్రీకరణతో పాటు ఎన్నో ఫీచర్లు

ఉదయం అన్నం తింటే కడుపు ఎక్కువగా నిండిపోతుంది. దానివల్ల అలసటగా, బద్ధకంగా అనిపించడం సహజం. పని వేగం తగ్గుతుంది. అంతేకాదు, ఉదయపు వేళల్లో శరీరానికి జీర్ణక్రియపై ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు బ్రేక్‌ఫాస్ట్‌గా అన్నం తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోవచ్చు. దీని వల్ల పరిస్థితి క్షీణించే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read:  Shaheen Sayeed: ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తు.. మహిళా డాక్టర్ గదిలో రూ.18 లక్షల క్యాష్.. కీలక విషయాలు వెలుగులోకి

కానీ, బరువు తగ్గాలనుకునేవారికి అన్నం పెద్ద శత్రువు. ఎందుకంటే దీనిని తినడం వలన బరువు త్వరగా పెరుగుతారు. డైట్‌ ఫాలో అయ్యేవారు, వర్కౌట్స్ చేసేవారు అన్నాన్ని పూర్తిగా దూరం పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. పైగా, నేటి కాలంలో కలుషితమైన ఆహారపు అలవాట్లు, నాసిరకాల బియ్యం వాడకం కారణంగా కూడా పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే వైద్యుల సలహా ఏంటంటే.. రోజులో ఒక్క పూట మాత్రమే అన్నం తినాలి. మిగతా పూటల్లో చపాతీ, సజ్జ, రాగి వంటి తేలికపాటి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం శరీరానికి చాలా మంచిదని సూచిస్తున్నారు.

Also Read:  Thummala Nageswara Rao: 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?