Strength Training: కండ బ‌లంతో క్యాన్స‌ర్‌కు చెక్!
strength training helps in cancer prevention
లైఫ్ స్టైల్

Strength Training: కండ బ‌లంతో క్యాన్స‌ర్‌కు చెక్!

Strength Training: బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైన తాజా మెటా-విశ్లేషణ (meta-analysis)లో, క్యాన్సర్ రోగులలో కండ బ‌లం (muscle strength) కార్డియోరెస్పిరేటరీ ఫిట్‌నెస్ (CRF) మరణించే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించగలవని తేలింది. కండర బలం ఎక్కువగా ఉన్న రోగుల్లో మరణించే ప్రమాదం 46% తగ్గినట్లు గుర్తించారు. అంటే, వ్యాయామం క్యాన్సర్ రోగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కీలకమైన అంశం అని ఈ పరిశోధన స్పష్టం చేసింద‌న్న‌మాట‌.

పరిశోధన ఎలా జరిగింది?

ఇది అర్థం చేసుకోవడానికి, పరిశోధకులు 42 అధ్యయనాల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించారు. ఈ అధ్యయనాల్లో 47,000 మంది క్యాన్సర్ రోగుల డేటా సమీకరించారు. ఇందులో క్లోమ గ్రంథి, కాలేయం, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్ రోగులు ఉన్నారు. ఈ అధ్యయనాల్లో క్యాన్సర్ రోగుల మానసిక ఆరోగ్యం, జీవనశైలి, వ్యాయామ పరమైన ప్రాముఖ్యతను పరిశీలించారు. కండర బలం అంచనా వేసేందుకు హ్యాండ్ గ్రిప్ టెస్ట్, నీ-ఎక్స్‌టెన్షన్ టెస్ట్ వంటి పరీక్షలు నిర్వహించారు. కార్డియోరెస్పిరేటరీ ఫిట్‌నెస్‌ను అంచనా వేసేందుకు సిక్స్-మినిట్ వాక్ టెస్ట్ చేయించారు, ఇందులో వ్యక్తి ఆరు నిమిషాలు నడిచిన తర్వాత ఆక్సిజన్, స్ట్రెస్ స్థాయిలను కొలిచారు.

పరిశోధన ఫలితాలు ఏమిటి?

Strength Training మరణ ప్రమాదం 31% నుంచి 46% వరకు తగ్గింది – క్యాన్సర్ రోగుల్లో కండర బలం మరియు కార్డియో ఫిట్‌నెస్ ఎక్కువగా ఉన్న వారిలో, మరణించే అవకాశాలు తగ్గినట్లు తేలింది.

ఎడ్వాన్స్‌డ్-స్టేజ్ క్యాన్సర్ రోగులకు కూడా ప్రయోజనం – క్యాన్సర్ అధిక దశలో ఉన్నవారికి (advanced-stage cancer patients) మరణించే అవకాశాలు 19% నుంచి 41% తగ్గాయి.

జీర్ణాశయ క్యాన్సర్ రోగులకు ఎక్కువ ప్రయోజనం – ముఖ్యంగా లంగ్ క్యాన్సర్, జీర్ణ సంబంధ క్యాన్సర్ ఉన్నవారికి అత్యధిక ప్రయోజనం కనిపించింది.

వ్యాయామం ఎందుకు ముఖ్యం?

కండర బలం – శరీరంలోని లీన్ మాస్ (lean mass) పెరగడం ద్వారా మెటబాలిజం మెరుగుపడుతుంది.

కార్డియో ఫిట్‌నెస్ – శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది, శరీర అవయవాలపై ఒత్తిడి తగ్గుతుంది, క్యాన్సర్ చికిత్స సమయంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

క్యాన్సర్ రోగులకు ప్రయోజనకరమైన వ్యాయామాలు

వెయిట్ లిఫ్టింగ్ (Weight Lifting)
రెసిస్టెన్స్ బ్యాండ్ వ్యాయామాలు (Resistance Band Exercises)
స్క్వాట్స్, లంగ్స్, పుష్-అప్స్ (Squats, Lunges, Push-ups)
నడక (Walking)
సైక్లింగ్ (Cycling)
ఈత (Swimming)
డాన్స్ లేదా గ్రూప్ ఎక్సర్సైజ్ క్లాసులు (Dance or Group Exercise Classes)

వ్యాయామం ఎంత సమయం చేయాలి?

రోజుకు 5-10 నిమిషాలు కూడా తగినంత ప్రయోజనాన్ని ఇస్తుంది. ఉదయం లేదా రాత్రి నడవడం లేదా చిన్నపాటి కండర బలం అభివృద్ధి చేసే వ్యాయామాలు చేయడం మంచి ఫ‌లితాల‌ను ఇస్తుంది.

ఈ పరిశోధన ఆధారంగా, భవిష్యత్తులో క్యాన్సర్ రోగుల ఆరోగ్య స్థాయిని బట్టి వైద్యులు ప్రత్యేక వ్యాయామ ప్రణాళికలు సిఫారసు చేసే అవకాశముంది. క్యాన్సర్ చికిత్సలో భాగంగా రోగులకు సరైన వ్యాయామాన్ని సూచించడం ద్వారా మరణ ముప్పును తగ్గించవచ్చు.
క్యాన్సర్ ఉన్నవారు తమ జీవనశైలిలో వ్యాయామాన్ని అనుసరించడం ద్వారా జీవితకాలాన్ని పెంచుకోవచ్చు, ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. శారీరకంగా చురుకుగా ఉండటం ద్వారా క్యాన్సర్ చికిత్స ప్రభావాన్ని మెరుగుపర్చుకోవచ్చు. కనుక, చిన్న మార్పులతోనే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయండి!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..