Breakfast: ఉదయం టిఫిన్ స్కిప్ చేస్తున్నారా?
Tiffin ( Image Source: Twitter)
లైఫ్ స్టైల్

Breakfast: ఉదయం టిఫిన్ స్కిప్ చేస్తున్నారా? అయితే, డేంజర్లో పడ్డట్టే!

Breakfast : రోజూ ఉదయం టిఫిన్ చేయడం ఆరోగ్యానికి ముఖ్యమైన అలవాటు. రాత్రి భోజనం చేసిన తర్వాత శరీరం దాదాపు 8 నుంచి 10 గంటల పాటు ఉపవాసంలోనే ఉంటాము. ఈ సమయంలో బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గుతాయి. ఉదయం టిఫిన్ చేయడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది, మెదడు చురుకుగా పనిచేస్తుంది. రోజంతా పని చేయడానికి అవసరమైన ఎనర్జీ వస్తుంది.

Also Read: CM Revanth Reddy: జనవరి 26 లోపు ఉద్యోగుల వివరాలు అందజేయాలి.. ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం!

ఉదయం టిఫిన్ చేయకపోతే అలసట, తలనొప్పి, నిద్రమత్తు వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా విద్యార్థులు, ఆఫీస్ పనులు చేసే వారిలో ఏకాగ్రత తగ్గిపోవడం, చిరాకు పెరగడం కనిపిస్తుంది. శరీరానికి అవసరమైన గ్లూకోజ్ అందకపోవడం వల్ల పనిలో ఆసక్తి తగ్గుతుంది.

Also Read: Thummala Nageswara Rao: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖాళీ కడుపుతో ఎక్కువసేపు ఉండడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. యాసిడిటీ, గ్యాస్, కడుపు మంటలు వంటి ఇబ్బందులు ఏర్పడవచ్చు. డయాబెటిస్ లేదా తక్కువ బీపీ ఉన్నవారికి ఉదయం టిఫిన్ మానేయడం మరింత ప్రమాదకరం, ఎందుకంటే బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పడిపోవడం లేదా పెరగడం జరగవచ్చు.

చాలామంది బరువు తగ్గాలని భావించి ఉదయం టిఫిన్ మానేస్తారు. కానీ ఇది తప్పు ఆలోచన. ఉదయం తినకపోతే మధ్యాహ్నం లేదా రాత్రి ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. దీని వల్ల జీర్ణక్రియపై భారం పడుతుంది అలాగే బరువు పెరిగే ప్రమాదం ఉంది.అందుకే రోజూ ఉదయం తప్పకుండా టిఫిన్ చేయాలి లేదంటే దానికి సరి పడా.. లైట్‌గా అయినా తినడం చాలా అవసరం. ఇడ్లీ, దోసె, ఉప్మా, ఓట్స్, పండ్లు లేదా ఉడికిన గుడ్డు లాంటి ఆరోగ్యకరమైన ఆహారం శరీరానికి శక్తిని ఇస్తుంది. రోజూ ఉదయం టిఫిన్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది.

Also Read: Ranga Reddy District: పట్టా భూములను కబ్జా చేస్తున్న బిల్డర్లు.. కోర్టు కేసులను లెక్కచేయకుండా బరితెగింపులు!

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Just In

01

Shivaji Controversy: శివాజీ వ్యాఖ్యల దుమారంలో మాజీ సర్పంచ్ నవ్య ఎంట్రీ.. సెన్సేషనల్ వ్యాఖ్యలు

Anasuya: అనసూయ సంచలన నిర్ణయం.. కరాటే కళ్యాణి, మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు

Illegal parking: మేడ్చల్‌లో ట్రాఫిక్ చిక్కులు.. అసలు సమస్య ఏంటంటే?

Karate Kalyani: అనసూయను ‘ఆంటీ’ అని కాకుండా ‘స్వీట్ 16 పాప’ అని పిలవాలా?

Pune Elections: బంపరాఫర్.. ఎన్నికల్లో ఓటు వేస్తే.. లగ్జరీ కారు, థాయ్‌లాండ్ ట్రిప్