Body Deficiency ( Image Source: Twitter)
లైఫ్‌స్టైల్

Body Deficiency: మీ గోళ్లపై గీతలు ఉన్నాయా.. అయితే, మీరు డేంజర్లో పడ్డట్టే!

Body Deficiency: అందమైన, మెరిసే గోళ్లు చేతుల అందాన్ని పెంచుతాయి. కానీ ఆ గోళ్లు బలహీనంగా మారడం, విరిగిపోవడం, పసుపు లేదా నలుపు రంగులోకి మారడం, గీతలు రావడం మొదలైతే.. అది కేవలం అందానికి సంబంధించిన సమస్య కాదు. ఇవి మీ శరీరంలో ఉన్న కొన్ని పోషక లోపాలను లేదా ఆరోగ్య సమస్యలను సూచించే సంకేతాలు కావచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయకండి. గోళ్లపై వచ్చే మార్పులు వయస్సు, పోషకాహార లోపం లేదా ఇతర పరిస్థితుల ప్రభావం కావచ్చు. ఒక్కో రకమైన గీత, రంగు లేదా ఆకార మార్పు మీ శరీరంలో ఏదో తప్పు జరుగుతోందని సూచిస్తుంది.

తెల్ల గీతలు (White Lines – Leukonychia Striata)

గోళ్లపై కనిపించే తెల్ల గీతలను వైద్యపరంగా ల్యూకోనైకియా స్ట్రియాటా అంటారు. ఇవి కింది కారణాల వలన వస్తాయి. గోళ్లకు గాయాలు లేదా దెబ్బలు, ఫంగల్ ఇన్ఫెక్షన్ (Onychomycosis), వారసత్వ కారణాలు కావొచ్చు. ఈ గీతలు ఎక్కువగా వ్యాపిస్తే డెర్మటాలజిస్టును సంప్రదించడం మంచిది.

Also Read: Bigg Boss Telugu 9: హౌస్‌లోకి ఊహించని గెస్ట్.. ప్రజా తిరుగుబాటు మొదలైంది.. ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్!

నల్ల లేదా గోధుమ రంగు గీతలు (Black or Brown Lines – Melanonychia)

కొంతమందికి గోళ్లపై నల్ల లేదా గోధుమ గీతలు వస్తాయి. వీటిని మెలనోనైకియా అంటారు. ఇవి కింది కారణాల వలన ఇవి వస్తాయి. గాయాలు లేదా ఇన్ఫెక్షన్లు, కొన్ని మందుల ప్రభావం, మెళనిన్ పిగ్మెంట్ అధికం కావడం వలన ఇలా జరుగుతుంది. ఇలాంటి గీతలు ఒక్కసారిగా రావడం పెరగడం మొదలైతే వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

Also Read: Mallikarjun Kharge: ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మడానికి లేదు.. హర్యానాలో ఏం జరిగిందో చూశాం.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే

నల్ల గీతలు – పోషక లోపం (Nutrient Deficiency)

కొన్నిసార్లు గోళ్లపై నల్లటి గీతలు రావడం విటమిన్ C, జింక్ లేదా ఇతర పోషకాల లోపానికి సంకేతం. పోషకాహారం సమృద్ధిగా ఉన్న ఆహారాలు పండ్లు, కూరగాయలు, గింజలు, తినడం వలన గోళ్ల బలంగా ఉంటాయి. అయితే గీతలతో పాటు నొప్పి, రక్తస్రావం, లేదా రంగు మార్పు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇది రక్తప్రసరణ సమస్యలు లేదా చర్మ క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యల సూచన కావచ్చు.

Also Read: Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ కౌంటింగ్ కు విస్తృత ఏర్పాట్లు.. 42 టేబుళ్ల పై 10 రౌండ్లుగా ఓట్ల లెక్కింపు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Just In

01

ED Probe on Al Falah: అల్ ఫలా వర్సిటీ స్థాపించిన జావేద్ సిద్ధిఖీ గురించి ఆరా తీయగా సంచలనాలు వెలుగులోకి!

Bhatti Vikramarka: ఖజానాలోని ప్రతీ పైసా ప్రజలదే.. దోపిడికి గురికానివ్వం.. డిప్యూటీ సీఎం

CM Revanth Reddy: ప్రపంచ పెట్టుబడులకు.. హైదరాబాద్ గమ్యస్థానం.. సీఎం రేవంత్ రెడ్డి

SS Rajamouli: ఎవరు పడితే వాళ్లు రావడానికి.. ఇది ఓపెన్ ఈవెంట్ కాదు! గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌కు వచ్చే దారిదే!

CM Chandrababu: ఏపీకి గుడ్ న్యూస్.. రెండ్రోజుల్లో విశాఖకు గూగుల్.. వెల్లడించిన సీఎం చంద్రబాబు