Personal Finance: ప్రస్తుతం రోజుల్లో వ్యక్తిగత ఆర్థిక సమస్యలు పెద్ద సవాల్‌గానే మారాయి. పెరుగుతున్న జీవన ఖర్చులు, రుణాలు, జీవనశైలి వ్యయాలు కారణంగా చాలా మంది నెల చివరికి పొదుపులు చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిలో మీ ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధం చేయడంలో సహాయపడే ఒక సులభమైన మార్గం ఉంది. అదే “ 50-30-20 నియమం”. 50-30-20 నియమం అంటే ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఈ నియమం ప్రకారం, మీ నెలవారీ ఆదాయాన్ని మూడు భాగాలుగా చేసుకోవాలి
50 శాతం అవసరాల కోసం (Needs): అద్దె, కూరగాయలు, విద్యుత్ బిల్లులు, రవాణా, EMI లు వంటి రోజువారీ అవసరాల ఖర్చులు.
30 శాతం కోరికల కోసం (Wants): షాపింగ్, బయట భోజనం, సినిమా, పర్యటనలు, ఇతర వినోద ఖర్చులు.
20 శాతం పొదుపులు ,పెట్టుబడుల కోసం (Savings & Investments): బ్యాంక్ సేవింగ్స్, SIPలు, మ్యూచువల్ ఫండ్లు, లేదా బాకీ రుణాల చెల్లింపులు.
Also Read: MLA Sanjay Kumar: హృదయ విదారక ఘటన.. డబ్బులు లేక తల్లిని మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లిన కొడుకు
ఇది కేవలం పొదుపు పద్ధతి మాత్రమే కాదు.. మీ డబ్బును తెలివిగా కేటాయించుకునే ఆర్థిక ప్రణాళిక.
ఈ నియమాన్ని జీవితంలో ఎలా అమలు చేయాలి?
ముందుగా మీ నెలవారీ ఆదాయాన్ని లెక్కించండి. ఆ తర్వాత 50-30-20 నిష్పత్తిలో ఖర్చులను వాడండి. అవసరాలు 50 శాతాన్ని మించితే, ఖర్చులను తగ్గించే మార్గాలు చూడండి. తక్కువ ఖర్చుతో మీ అవసరాలను చూసుకోండి, అనవసర ఖర్చులను తగ్గించడం వంటి మార్గాలను అలవాటు చేసుకోండి. పొదుపులను నెల మొదట్లోనే ఆటోమేటిక్‌గా డెబిట్ అయ్యేలా సెట్ చేయడం మంచిది. ఇది అనవసర ఖర్చులను తగ్గించి, నిరంతర పొదుపు అలవాటును పెంపొందిస్తుంది.
Also Read: Gadwal Crime: పోలీసుల అదుపులో మోసాలకు పాల్పడుతున్న బంగారం వ్యాపారి.. మరో ఘటనలో బంగారం కోసం మహిళ హత్య
50-30-20 నియమం ఎందుకు పనిచేస్తుంది?
ఈ పద్ధతి ఆర్థిక సమతౌల్యం సాధించడంలో చాలా సమర్థవంతం. ఇది మీరు ప్రస్తుత అవసరాలను తీర్చుకునే క్రమంలో భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి ప్రోత్సహిస్తుంది.
ఉదాహరణకు, మీరు నెలకు 1 లక్ష సంపాదిస్తే..
1.రూ. 50,000 అవసరాల కోసం,
2. రూ. 30,000 కోరికల కోసం,
3. రూ. 20,000 పొదుపులు లేదా పెట్టుబడుల కోసం కేటాయించాలి.
ఇలా చేయడం వలన మీరు జీవితాన్ని సంతోషిస్తూ కూడా ఆర్థిక భద్రతను పొందగలుగుతారు.
దీని వలన ప్రయోజనాలు ఇవే..
1. ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది.
2. అనవసర ఖర్చులు తగ్గుతాయి.
3. పొదుపు చేయడం అలవాటు అవుతుంది.
4. భవిష్యత్తు లక్ష్యాలు సాధించడానికి స్పష్టమైన ప్రణాళిక ఉంటుంది.
మీరు ఉద్యోగ జీవితాన్ని మొదలు పెట్టినట్లయితే.. ఆర్థిక స్థిరత్వం కోరుకునే వాళ్ళైతే 50-30-20 నియమం మీకు మంచిగా సెట్ అవుతుంది. ఇది సులభమైనదే కానీ, ప్రభావవంతమైన ఆర్థిక పద్ధతి కూడా.. డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుని, దాన్ని సరైన దిశలో నడిపించడంలో ఈ నియమం మీకు స్నేహితుడిగా ఉంటుంది.

