Health Tips: వేసవి కాలంలో వచ్చే సమస్యలు వేరు, మాన్సూన్ సీజన్ లో వచ్చే సమస్యలు వేరు. అయితే, ఎక్కువగా చలి కాలంలోనే అనారోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుంది. చలి తీవ్రత ఎక్కువై, ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకోవడంతో రోగనిరోధక శక్తి తగ్గి, జలుబు, ఫ్లూ, జీర్ణ సమస్యలు వంటి ఇన్ఫెక్షన్‌లు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు, పానీయాలు తీసుకోవడం ఎంతో అవసరమని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
1. తులసి–అల్లం టీ
ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన తులసి బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కొనే గుణాలను కలిగి ఉంటుంది. అల్లం శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తాజా తులసి ఆకులు, అల్లం ముక్కలను నీటిలో మరిగించి తీసుకునే ఈ వెచ్చని టీ, మాన్సూన్ కాలంలో కనిపించే సాధారణ ఇన్ఫెక్షన్‌లను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
2. హల్దీ పాలు (గోల్డెన్ మిల్క్)
పసుపులో ఉండే కర్కుమిన్ అనే యాంటీఆక్సిడెంట్ శరీర రక్షణ శక్తిని బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గోరువెచ్చని పాలలో ఒక టీ స్పూన్ పసుపు, కొద్దిగా మిరియాల పొడి, తేనె కలిపి తాగితే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పానీయాన్ని సాయంత్రం వేళ తీసుకుంటే శరీరానికి మంచిది
3. నిమ్మ–తేనె నీరు
అత్యంత ప్రభావవంతమైన పానీయాల్లో నిమ్మ–తేనె నీరు కూడా ఒకటి. నిమ్మలో ఉండే విటమిన్ C శరీర రక్షణశక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే శరీరం హైడ్రేట్‌గా ఉండటమే కాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. వర్షాకాలంలో వచ్చే కడుపు నొప్పి సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది.
4. ఆమ్లా జ్యూస్
ఆమ్లాలో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉండే సూపర్ ఫ్రూట్. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది సహజ శక్తివంతమైన పానీయం. కొద్దిగా నీటిని తీసుకుని, దానిలో తేనె కలిపి వేసి ఆమ్లా ముక్కలు వేసి జ్యూస్ లాగా చేసుకుని తాగితే శరీరాన్ని ఇన్ఫెక్షన్‌ల నుంచి రక్షించడమే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ బాధ్యత వహించదని గమనించగలరు.
