Happy Children’s Day: ప్రతి ఏడాది నవంబర్ 14న భారతదేశం బాలల దినోత్సవం (Childrens Day) ను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటుంది. ఈ రోజు మన తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా జరుపుకుంటారు. ఆయన పిల్లల పట్ల చూపిన ప్రేమ, ఆప్యాయం కారణంగా పిల్లలు ఆయనను “చాచా నెహ్రూ” అని ముద్దుగా పిలిచేవారు.
బాలల దినోత్సవ చరిత్ర
మొదటగా బాలల దినోత్సవం యునివర్సల్ చిల్డ్రన్స్ డే (Universal Children’s Day) గా నవంబర్ 20న జరుపుకునేవారు. కానీ, 1964లో పండిట్ నెహ్రూ గారి మరణం తర్వాత, ఆయన పిల్లల పట్ల ఉన్న అభిమానాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన జన్మదినం అయిన నవంబర్ 14 నాటి నుంచే భారతదేశంలో బాలల దినోత్సవం జరుపుకోవడం మొదలుపెట్టారు.
బాలల దినోత్సవ ప్రాముఖ్యత
బాలల దినోత్సవం కేవలం ఒక పండుగ కాదు. ఇది పిల్లల హక్కులు, విద్య, ఆరోగ్యం, సమాన అవకాశాలపై అవగాహన పెంచే రోజు. ఈ రోజు దేశమంతా పాఠశాలలు, కళాశాలలు, సామాజిక సంస్థలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, నాటకాలు, డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తాయి. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, సమాజ పట్ల బాధ్యత పెంపొందించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్ ఉద్దేశ్యం.
జవహర్‌లాల్ నెహ్రూ ఏం చెప్పాడంటే?
పండిట్ నెహ్రూ గారు పిల్లలనే దేశ భవిష్యత్తుగా భావించారు. ఆయన మాటల్లో “ ఈ రోజు యొక్క పిల్లలు రేపటి దేశ నిర్మాణకర్తలు. వారిని ప్రేమతో, విద్యతో, విలువలతో తీర్చిదిద్దితే, భారతదేశం ఉజ్వల భవిష్యత్తును సాధిస్తుంది.” నెహ్రూ గారు విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి IITలు, AIIMS, UGC, National Science Policy వంటి పథకాలను ప్రారంభించారు. ఆయన దృష్టిలో పిల్లలు కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, దేశాన్ని మార్చే పౌరులు.
