Health Tips: వేసవి రానే వచ్చింది. మండుతున్న ఎండలకు జనం అల్లాడుతున్నారు. ఇక బయటతిరిగే పనిచేసేవాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. భానుడు భగభగల్ని తాళలేకపోతున్నారు. దీంతో సేద తీరేందుకు చల్లటి పానీయాలను, చెరుకు రసం, పండ్ల రసాలతో పాటు కొబ్బరినీళ్లను సేవిస్తున్నారు. సమ్మర్‌లో కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతుంటారు.
అయితే ఎంత ఆరోగ్యకరమైన కూడా కొందరు మాత్రం ఈ కొబ్బరి నీళ్లు తాగకపోవడమే మంచిది. కొబ్బరికాయలు సహజంగా నీటిని ఉత్పత్తి చేస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగకుండా ఉండాలి.
కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ సి, బి-కాంప్లెక్స్ విటమిన్లు (రైబోఫ్లేవిన్, నియాసిన్, ఫోలేట్), ఇనుము, భాస్వరం, రాగి, మాంగనీస్ , యాంటీఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు ,సైటోకినిన్లు వంటి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.
ముఖ్యంగా వ్యాయామం తర్వాత లేదా వేడి వాతావరణంలో దీని వినియోగం శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నీరు మూత్రపిండాలలోని ఖనిజాలను కరిగించడానికి సహాయపడుతుంది.
కొబ్బరి నీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో, ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. కొబ్బరి నీళ్ళు యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
కొబ్బరి నీరు జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. కొబ్బరి నీళ్లు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి. తద్వారా చర్మం మృదువుగా ,మెరుస్తూ ఉంటుంది. కానీ కొందరు మాత్రం కొబ్బరి నీళ్లు తాగకూడదు.
Also Read: Telangana Weather Alert: 4 రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు వడగాలులు తప్పవు
రక్తంలో పొటాషియం స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదు. తీవ్రమైన మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు కూడా ఈ నీటిని తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలెర్జీలు ఉన్నవారు కూడా ఈ నీటిని తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు..
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడింది. ఏదైనా నివారణను ప్రయత్నించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం చాలా అవసరం)