Telangana Weather Alert: మార్చిలోనే మాడు పగిలేలా ఎండలు కొడుతుండటంతో చిన్నా పెద్దా అంతా ఉక్కిరిబిక్కిరవుతన్నారు. బయటికెళ్తే వడగాలుల ధాటికి తట్టుకోలేకపోతున్నారు. ఎండలో ప్రయాణిస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కు పైగా నమోదవుతున్నాయి.ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల తదితర జిల్లాల్లో ఎండ తీవ్రతతోపాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉందని ఇటీవల వాతావరణశాఖ వెల్లడించింది. సాధారణం కంటే 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని తెలిపింది.
Samantha: మళ్లీ సెలైన్.. సమంతకి ఏమైంది.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఈ నేపథ్యంలోనే శనివారం నుంచి పలు జిల్లాల్లకు ఎల్లో అలర్టె జారీ చేసింది. అయితే దాదాపు ఫిభ్రవరి మధ్య నుంచే ఎండ వేడికి మాడిపోతున్న ప్రజలు కొద్దిగా వాతావరణం చల్లబడితే బావుండు, ఈ హీట్ నుంచి రిలీఫ్ దొరికితే బావుంటు అనుకుంటున్నారు. అలాంటి వారిని సంతోషపరిచే చల్లని కబురును వాతావరణ శాఖ తాజాగా అందించింది. ఈ నెల 21 నుంచి తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని తెలిపింది.
మార్చి 20వ తేదీ తరువాత వడగాలుల ప్రభావం తగ్గుముఖం పట్టనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దాదాపు 20 నుంచి 24వ తేదీ వరకు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఆయా చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుసే అవకాశం ఉందని వెల్లడించింది. 25వ తేదీ నుంచి తిరిగి ఎండ ప్రభావం మొదలవుతుందని పేర్కొంది. అలాగే, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల తదితర జిల్లాల్లో వడగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
వేడి దృష్ట్యా ఈ సమయంలో వర్షాలు పడితే కొంతమేరు ఉపశమనమే గానీ ఓవైపు పంటచేతికొచ్చే సమయం కూడా ఇదే కావడం చేత ఆందోళన కూడా ఉంటుంది. ఒకవేళ వర్ష తీవ్రత ఎక్కువ ఉంటే పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. కానీ ఇప్పటివరకు వాతావరణశాఖ నుంచి అలాంటి హెచ్చరికలు అయితే ఏమి రాలేదు.
మరోవైపు ఏపీకి వర్ష సూచన ఏమి రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రత కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో పోడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. రాయలసీమలో మాత్రం ఉష్ణోగ్రతలు పెరిగుతాయని సూచించింది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సీయస్ టెంపరేచర్ పెరగనున్నట్లు హెచ్చరించింది. వడగాలులు ప్రభావం కూడా ఉన్నందున పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైన పనులు ఉంటే తప్ప బయట తిరగకపోవడమే మంచిదని నిపుణులు చెప్తున్నారు.