- ల్యాండ్ వివాదంలో హైకోర్టును ఆశ్రయించిన తారక్
- 2003లో గీత లక్ష్మీ నుండి ప్లాట్ కొనుక్కున్న ఎన్టీఆర్
- ఎన్టీఆర్ ప్లాట్ పై బ్యాంకులకు హక్కులున్నాయన్న డీఆర్టీ
- డీఆర్ఠీ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరిన ఎన్టీఆర్
- ప్రాపర్టీ మోర్ట్ గేజ్ ద్వారా పలు బ్యాంకులలో రుణాలు
- జూన్ 6న విచారణ చేపడతామన్న హైకోర్టు
jr.NTR filed case against owner of cheating land in High Court:
జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో ల్యాండ్ కు సంబంధించిన వివాదంలో జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 75 ల తనకు సంబంధించిన ప్లాట్ విషయంలో వివాదం తలెత్తడంతో ఎన్టీఆర్ కోర్టుకు వెళ్లారు. 2003 సంవత్సరంలో గీత లక్ష్మి అనే మహిళ నుంచి ఎన్టీఆర్ ప్లాట్ ను కొనుగోలు చేశారు. అయితే ఆ ల్యాండ్ పై బ్యాంకులకు హక్కులు ఉన్నాయంటూ డీఆర్‌టీ (రుణ వసూళ్ల ట్రైబ్యునల్) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.
ఫేక్ డాక్యుమెంట్స్ తో రుణాలు
1996 సంవత్సరంలో ఆ ల్యాండ్ మీద పలు బ్యాంకుల వద్ద నుంచి ప్రాపర్టీ మార్ట్ గేజ్ ద్వారా ఫేక్ డాక్యుమెంట్స్ తో గీత లక్ష్మి రుణాలు తీసుకుంది. అయితే, జూనియర్ ఎన్టీఆర్‌కు అమ్మే సమయంలో ఆ విషయాన్ని గీత లక్ష్మి దాచిపెట్టింది. ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా ఇదే ల్యాండ్ మీద ఐదు బ్యాంకుల నుంచి గీత లక్ష్మి లోన్స్ తీసుకుంది. కానీ, ల్యాండ్ అమ్మే సమయంలో కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్ గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్‌కు గీత లక్ష్మి చెప్పింది. ఆ సమయంలో చెన్నైలోని ఒక బ్యాంక్‌లో లోన్ క్లియర్ చేసి ఆ డాక్యుమెంట్స్‌ను ఎన్టీఆర్ తీసుకున్నారు. 2003 నుంచి ఆ ప్లాట్ ఒనర్‌గా తారక్ ఉన్నారు.
ల్యాండ్ అమ్మినవారిపై కేసు
అయితే 1996లోనే ఈ స్థలాన్ని తనఖా పెట్టి రుణం చెల్లించని కారణంగా ఆ ఆస్తిపై హక్కులు తమవేనని పేర్కొంటూ పలు బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి. వీటిని రద్దు చేయాలంటూ ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించారు. ల్యాండ్ విషయంలో సమగ్ర విచారణ చేయకుండానే డీఆర్‌టీ (రుణ వసూళ్ల ట్రైబ్యునల్) ఆదేశాలు ఇచ్చిందంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.. స్థలాన్ని అమ్మిన వారిపై కేసు పెట్టినట్లు తారక్ లాయర్ తెలిపారు. దీనితో జూన్ 3 లోపు డీఆర్టీ డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమంది హై కోర్టు. అయితే డాకెట్ ఆదేశాలు అందాల్సి ఉందని, కొంత సమయం ఇస్తే వాటి వివరాలు సమర్పిస్తామని చెప్పారు. జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.