UPSC CSE 2024 toppers: అఖిల భారత సర్వీసు ఫలితాలను తాజాగా యూపీఎస్సీ బోర్డ్ విడుదల చేసింది. సివిల్స్ – 2024 (UPSC Civils Final result 2024) తుది ఫలితాల్లో పలువురు అభ్యర్థులు సత్తా చాటారు. శక్తి దూబే ప్రథమ ర్యాంక్ సాధించగా హర్షిత గోయల్, అర్చిత్ పరాగ్ 2, 3 స్థానాల్లో నిలిచారు. ఈ దఫా తెలుగోళ్లు సైతం తమ సత్తా ఎంటో చూపించారు.
తెలుగు ర్యాంకర్లు వీరే
సివిల్స్ – 2024 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు మెరిశారు. ఎట్టబోయిన సాయి శివాని 11వ ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల నుంచి టాపర్ నిలిచింది. వచ్చింది. అలాగే బన్నా వెంకటేశ్ 15వ ర్యాంకు సాధించగా.. అభిషేక్ శర్మకు 38వ ర్యాంకు, రావుల జయసింహారెడ్డికి 46వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. అలాగే శ్రవణ్‌కుమార్ రెడ్డి 62వ ర్యాంకు రాగా.. సాయి చైతన్య జాదవ్‌కు 68వ ర్యాంకు వచ్చింది. ఎన్. చేతన రెడ్డి 110వ ర్యాంక్, చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి 119వ ర్యాంక్ తో సివిల్స్ పరీక్షల్లో మెరిశారు.
Also Read: Lady Aghori Arrested: అఘోరీకి బిగ్ షాక్.. అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు.. ఎందుకంటే?
టాప్-10లో దక్కని చోటు..
సివిల్స్ సాధించిన టాప్ – 10 అభ్యర్థుల్లో ఒక్క తెలుగు వ్యక్తి చోటు దక్కకపోవడం కాస్త నిరాశ పరిచే అంశమే. షా మార్గి చిరాగ్ 4వ ర్యాంక్ సాధించగా.. ఆకాశ్ గార్గ్ 5, కోమల్ పునియా 6 స్థానాల్లో నిలిచారు. ఆయుషీ బన్సల్ 7వ ర్యాంక్, రాజ్‌కృష్ణ ఝా 8, ఆదిత్య విక్రమ్ అగర్వాల్ 9, మయాంక్ త్రిపాఠి 10 ర్యాంకులు సాధించి టాప్ – 10లో నిలిచారు. ఎట్టబోయిన సాయి శివాని 11వ ర్యాంక్ సాధించి కొద్దిలో టాప్ – 10లో చోటు మిస్ అయ్యింది.