MPPSC Recruitment 2025: మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) 120 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక MPPSC వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 27-04-2025. అర్హత , వయోపరిమితి, జీతం, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు, అధికారిక నోటిఫికేషన్, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం గురించి ఇక్కడ తెలుసుకుందా..
మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) రిక్రూట్‌మెంట్ 2025లో 120 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు కోరుతుంది. బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, M.Phil/Ph.D ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 28-03-2025న ప్రారంభమయ్యి 27-04-2025న ముగుస్తుంది. అభ్యర్థి MPPSC వెబ్‌సైట్, mppsc.mp.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఖాళీల నియామకానికి ఉపాధి నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము
జనరల్ మరియు అన్ని ఇతర రాష్ట్ర అభ్యర్థులకు: రూ. 500/-
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎస్సీ / ఎస్టీ / ఓబీసీ / పిహెచ్ (దివ్యాంగ్) అభ్యర్థులకు: రూ. 250/-
సవరణ ఛార్జీలు: రూ. 50
ఎంపీ పోర్టల్ ఛార్జీలు: రూ. 40
ఎంపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 28-03-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 27-04-2025 వరకు ఉంది.
ఎంపీపీఎస్సీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నోటిఫికేషన్ 2025 వయోపరిమితి
కనీస వయోపరిమితి: 21 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి: 40 సంవత్సరాలు
నియమాల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
అర్హత
అభ్యర్థులు ఈ క్రింది రంగాలలో ఒకదానిలో బ్యాచిలర్, మాస్టర్స్ లేదా డాక్టరేట్ డిగ్రీని కలిగి ఉండాలి. ఫుడ్ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఆయిల్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ సైన్స్, వెటర్నరీ సైన్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ లేదా మెడిసిన్ చదివిన వాళ్ళు అర్హులు. పదవికి అవసరమైన అర్హతలను పొందాలంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి డిగ్రీ పొందాలి.
Also Read: Rythu Mahotsavam Program: రైతు మహోత్సవ ప్రారంభం.. మంత్రుల సందడి, శాస్త్రవేత్తల సమీక్ష!
MPPSC ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2025 ఖాళీ వివరాలు
పోస్ట్ పేరు మొత్తం
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ – 120
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు