Damodar Rajanarsimha [image credit; SWETCHA REPORTER)
తెలంగాణ

Damodar Rajanarsimha: ప్రైవేట్ కాలేజీలలో మోసాలకు చెక్.. ప్రభుత్వం ఉక్కుపాదం.. హెల్త్ మినిస్టర్ సీరియస్!

Damodar Rajanarsimha: ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ఘోస్ట్ ఫ్యాకల్టీలతో నడిపిస్తే చర్యలు ఉంటాయని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. ఆయన సచివాలయంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల మేనేజ్ మెంట్స్, డీన్స్, ప్రిన్సిపాల్స్ తో రివ్యూ నిర్వహించారు. మెడికల్ ఎడ్యుకేషన్ నాణ్యత ప్రమాణాలు, ఎన్‌ఎంసీ నిబంధనలు, ఫాకల్టీ, అటెండెన్స్, ఫీజులు, తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఘోస్ట్ ఫాకల్టీని పెట్టి నడిపించడం సరైన పద్ధతి కాదన్నారు. ఇలాంటి చర్యలు వల్ల వైద్య విద్య ప్రమాణాలు దిగజారుతాయన్నారు .తెలంగాణ డాక్టర్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉన్నదన్నారు.

ప్రపంచంలోని ఎన్నో ప్రఖ్యాత మెడికల్ ఇనిస్టిట్యూట్స్‌ను ఇక్కడ చదువుకున్న డాక్టర్లు లీడ్ చేస్తున్నారన్నారు. ఇక్కడి వైద్య విద్య ప్రమాణాల వల్లే అది సాధ్యమైందన్నారు. వైద్య విద్యలో నాణ్యత ప్రమాణాలు తగ్గితే ప్రజల ప్రాణాలకే ముప్పు అని వివరించారు.ఈ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించని కాలేజీల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మెడికల్ స్టూడెంట్స్‌కు స్టైఫండ్స్ చెల్లించే విషయంలో కొన్ని కాలేజీలపై వరసగా ఫిర్యాదులు వస్తున్నాయని, పిల్లలకు ఇచ్చే స్టైఫండ్ విషయంలో రాజీ పడొద్దన్నారు.

 Also Read: Guguloth Kavyashree: జాతీయ స్థాయిలో క్రికెట్ పేరు తెచ్చుకున్న కావ్య శ్రీ నీ… అభినందించిన సూర్యాపేట పోలీస్!

అది వాళ్ల చదువులపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నదన్నారు. పిల్లలకు కచ్చితంగా స్టైఫండ్ చెల్లించాలన్నారు. కాలేజీలకు అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్‌లో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అదనపు ఫీజుల కోసం స్టూడెంట్స్‌ను ఇబ్బంది పెట్టినా, అడ్వాన్స్‌గా ఫీజులు కట్టాలని ఒత్తిడి చేసినా ఉపేక్షించేది లేదని నొక్క చెప్పారు.

ఎన్‌ఎంసీ నిబంధనల విషయంలో కాలేజీలు లేవనెత్తిన సమస్యలను, ఎన్‌ఎంసీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంల పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వీసీ నందకుమార్ రెడ్డి, డీఎంఈ నరేంద్ర కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?