IDBI Bank Jobs: నిరుద్యోగులకు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI బ్యాంక్) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా గ్రాడ్యుయేట్, BCA, B.Sc, B.Tech/B.E, LLB, CA, ICWA, M.Sc, MBA/PGDM ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 07-04-2025న ప్రారంభమై 20-04-2025న ముగుస్తుంది. అభ్యర్థి IDBI బ్యాంక్ వెబ్‌సైట్, idbibank.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
IDBI బ్యాంక్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ PDF ను idbibank.inలో విడుదల చేశారు. పూర్తి ఉద్యోగ వివరాలు, ఖాళీల పోస్టులు, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI బ్యాంక్) అధికారికంగా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు దానిని క్రింది లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము
జనరల్, EWS & OBC కేటగిరీలకు: GSTతో సహా రూ.1050/- ను చెల్లించాలి.
SC/ST కేటగిరీలకు: GSTతో సహా రూ.250/- ను చెల్లించాలి.
IDBI బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 07-04-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు తేదీ : 20-04-2025
Also Read: Chapata chillies: తెలంగాణలో మరోప్రాతానిక జియాలాజికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇచ్చిన సంస్థ.. అదేంటంటే!
IDBI బ్యాంక్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ 2025 వయోపరిమితి
డిప్యూటీ జనరల్ మేనేజర్, గ్రేడ్ ‘D’ పోస్టులకు కనిష్టం: 35 సంవత్సరాలు, గరిష్టం: 45 సంవత్సరాలు ఉండాలి.
( అభ్యర్థి 02-04-1980 కంటే ముందు 01.04.1990 కంటే తర్వాత జన్మించి ఉండాలి )
అసిస్టెంట్ జనరల్ మేనేజర్, గ్రేడ్ ‘C’ పోస్టులకు: కనిష్టం: 28 సంవత్సరాలు, గరిష్టం: 40 సంవత్సరాలు ఉండాలి.
( అభ్యర్థి 02.04.1985 కంటే ముందు 01.04.1997 కంటే తర్వాత జన్మించి ఉండాలి)
మేనేజర్ – గ్రేడ్ ‘బి’ కోసం: కనిష్టం: 25 సంవత్సరాలు , గరిష్టం: 35 సంవత్సరాలు ఉండాలి
( అభ్యర్థి 02.04.1990 కంటే ముందు 01.04.2000 కంటే తర్వాత జన్మించి ఉండాలి)
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
Also Read: Hanamkonda Fire Accident: అగ్ని ప్రమాదంలో మొక్క జొన్న పంట దగ్దం.. దిక్కుతోచని స్ధితిలో రైతు
అర్హత
అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేట్, BCA, B.Sc, B.Tech/B.E, LLB, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్, CA, ICWA, M.Sc, MBA/PGDM సంబంధిత రంగాలు కలిగి ఉండాలి
IDBI బ్యాంక్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ 2025 ఖాళీ వివరాలు
ఖాళీల పోస్టులు
డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM) – గ్రేడ్ D 08
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM) – గ్రేడ్ C 42
మేనేజర్ – గ్రేడ్ B 69