Excise police raided (imagecredit:swetcha)
జాబ్స్

Excise police raided: ఫంక్షన్ హాల్ పై ఎక్సైజ్ పోలీసుల దాడి.. భారీగా మద్యం సీజ్!

Excise police raided: మొయినాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్ పై దాడి చేసిన ఎక్సయిజ్ డీటీఎఫ్​ పోలీసులు 4లక్షల రూపాయల విలువ చేసే నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం బాటిల్లను సీజ్ చేశారు. ఈ క్రమంలో మందు దావత్​ ఇచ్చిన వ్యక్తితోపాటు ఫంక్షన్​హాల్ యజమానిపై కూడా కేసులు నమోదు చేశారు. ఎక్సయిజ్ ఎన్​ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

మొయినాబాద్‌లోని ఓ ఫంక్షన్​ హాల్లో ఓ కుటుంబం తమ పిల్లలకు సంబంధించిన విందు జరిపింది. అతిధులందరికీ మందు దావత్​పెట్టింది. ఈ మేరకు సమాచారం అందటంతో శంషాబాద్ ఎక్సయిజ్ డీటీఎఫ్​సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై శ్రీకాంత్ రెడ్డితోపాటు కానిస్టేబుళ్లు గణేశ్, మల్లేష్, నెహ్రు, సాయిశంకర్, శేఖర్ లతో కలిసి దాడి చేశారు.

Also Read: Mahabubabad SP: అనుమానితులపై దృష్టి.. రాత్రి వేళల్లో పోలీసుల సడన్ చెకింగ్స్!

ఢిల్లీకి చెందిన 60 బ్లాక్ లేబుల్, గోవాకు చెందిన 4 బాటిళ్ల నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని సీజ్​ చేశారు. దాంతోపాటు తెలంగాణకు చెందిన 3 లిక్కర్​ బాటిళ్లతోపాటు 12 బీర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మందు దావత్ ఇచ్చిన వ్యక్తి తమ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని శంషాబాద్​ ఎక్సయిజ్ సూపరిండింటెంట్ కృష్ణప్రియ తెలిపారు.

 

Just In

01

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు

Intermediate Exams: ఈసారి ఇంటర్ పరీక్షలు యథాతథం.. వచ్చే సంవత్సరం నుంచి మార్పులు

Satish Shah passes away: ప్రముఖ వెటరన్ నటుడు సతీశ్ షా కన్నుమూత..