GHMC: స్టాండింగ్ కమిటీ ముహూర్తం ఖరారు చేసేందు మల్లగుల్లాలు
GHMC (imagecredit:twitter)
Telangana News, హైదరాబాద్

GHMC: స్టాండింగ్ కమిటీ ముహూర్తం ఖరారు చేసేందుకు.. పాలక మండలి మల్లగుల్లాలు

GHMC: దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా అవతరించిన జీహెచ్ఎంసీ(GHMC) నగరాభివృద్ధి, పౌర, అత్యవసర సేవల నిర్వహణకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే కౌన్సిల్, స్టాండింగ్ కమిటీల సమావేశాలు ఎపుడు నిర్వహించాలన్న అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఇటీవలే నాలుగు రోజుల క్రితం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన స్టాండింగ్ కమిటీ సమావేశం అనూహ్యాంగా రద్దయిన సంగతి తెల్సిందే. అధికారులు ఇష్టారాజ్యంగా టేబుల్ అజెండాలు పెట్టడటం పట్ల సీరియస్ అయిన మేయర్ టేబుల్ అజెండాలు కాకుండా సాధారణ ప్రతిపాదనలను సిద్దం చేయాలని కూడా ఆదేశించినట్లు తెలిసింది. ముఖ్యంగా వచ్చే నెల 10వ తేదీతో ప్రస్తుత పాలక మండలి అధికార గడువు ముగియనున్నందున అంతలోపు మరోసారి స్టాండింగ్ కమిటీ, అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) కు సంబంధించి అధికారులు ఇప్పటికే రూ. 11 వేల 460 కోట్లతో రూపకల్పన చేసిన జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ పై మున్సిపల్ చట్టం ప్రకారం ఖచ్చితంగా కౌన్సిల్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టి, సభ్యులు చర్చించినానంతరం కావల్సిన మార్పులు చేర్పులు చేసి ఆమోదించాలన్న నిబంధన ఉన్నట్లు సమాచారం.

సమావేశాలు ముగిసే లోపు

అయితే ఫిబ్రవరి 10 లోపు బడ్జెట్ పై స్పెషల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని అధికారులు భావిస్తున్నా, ఈ నెల 28 నుంచి కేంద్ర బడ్జెట్ పై పార్లమెంటు సమావేశాలు జరగనున్నందున, కౌన్సిల్ లో పార్లమెంట్ సభ్యులు ఎక్స్ అఫిషియో మెంబర్లుగా వ్యవహారిస్తున్న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత కౌన్సిల్ సమావేశం నిర్వహించటం నిబంధనలకు విరుద్దం కానున్నట్లు మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే లోపు కౌన్సిల్ అధికార గడువు ముగియనున్నందున ఎపుడు కౌన్సిల్ సమావేశం నిర్వహించాలన్న విషయంపై పాలక మండలి పెద్దలు, అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత దిగువ స్థానిక సంస్థ సభ అయిన కౌన్సిల్ సమావేశం నిర్వహించే ఛాన్స్ ఉందా? లేదా? అన్న విషయంపై న్యాయ నిపుణలు, జీహెచ్ఎంసీ(GHMC) చట్టంపై పట్టు కల్గిన అధికారులు అభిప్రాయాలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు సమాచారం. లేక పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నపుడు ఆదివారం వంటి సెలవు రోజుల్లో ఈ కౌన్సిల్ సమావేశం నిర్వహించుకునేందుకు ఏమైనా వెసులుబాటు ఉందా? అన్న విషయాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

Also Read: Republic Day 2026: అబ్బురపరిచిన ఏపీ శకటాలు.. అమరావతిలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు!

ఈ నెలాఖరులోపు స్టాండింగ్ కమిటీ మీటింగ్?

ఈ నెలాఖరులోపు స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి, నూతన ఆర్థిక సంవత్సర బడ్జెట్ తో పాటు పలు ముఖ్యమైన ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలుపుకోవాలని జీహెచ్ఎంసీ పాలక మండలి పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నపుడు స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించుకునే అవకాశమున్నందున, కనీసం స్టాండింగ్ కమిటీలోనైనా బడ్జెట్ పై చర్చ కొనసాగించి, మార్పులు చేర్పులు సూచించాలని కూడా భావిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, ప్రస్తుత పాలక మండలి గడిచిన అయిదేళ్లలో ఎపుడు కూడా షెడ్యూల్ ప్రకారం సజావుగా కౌన్సిల్ సమావేశం నిర్వహించలేదని విపక్షాలు మండిపడుతున్నాయి. కనీసం పాలక మండలి చివరి రోజుల్లోనైనా రెండు రోజుల పాటు స్పెషల్ కౌన్సిల్ నిర్వహించి, బడ్జెట్ తో పాటు ఇతర ప్రజాసమస్యలపై చర్చించి, సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని విపక్షాలకు చెందిన పలువురు కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. అయిదేళ్లు అధికారంలో ఉన్న పాలక మండలి ఇప్పటి వరకు అయిదు వార్షిక బడ్జెట్ లను ఆమోదించినా, ఆరో వార్షిక బడ్జెట్ ను ఆమోదించే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ఈ అవకాశాన్నిపాలక మండలి సద్వినియోగం చేసుకుంటుందా? లేక బడ్జెట్ పై తన ముద్ర లేకుండానే పదవీ కాలాన్ని ముగించుకుంటుందా? వేచి చూడాలి.

Also Read: TPCC Chief: కాంగ్రెస్ నేతల త్యాగం వల్లే.. భారతావనికి స్వాతంత్రం.. టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?