OU ACB Raid: అధికారికంగా సాయ పడేందుకు లంచం తీసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగిని ఏసీబీ(ACB) అధికారులు మంగళవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. వర్సిటీ బిల్డింగ్ డివిజన్ లో రాకొండ శ్రీనివాసులు(Rakonda Srinivasulu) డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్(Deputy Executive Engineer) గా పని చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఓ కాంట్రాక్టర్ క్యాంపస్ లోని మానేరు బాయ్స్ హాస్టల్(Maneru Boys Hostel) భవనానికి సంబంధించిన రిపేరు పనులను ఇటీవల పూర్తి చేశాడు.
Also Read: Gadwal News: పంచాయతీ పోరులో గొంతు విప్పుతున్న యువగళం.. ఎన్నికల బరిలో నిలిచిన యువత
11వేల రూపాయలు లంచం
అయితే దీనికి సంబంధించి అతనికి 7.17 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. అయితే, ఈ బిల్లును మంజూరు చేయటానికి శ్రీనివాసులు 11వేల రూపాయలు లంచం అడిగాడు. దాంతో కాంట్రాక్టర్(Contractor) ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో వలపన్నిన ఏసీబీ అధికారులు మంగళవారం శ్రీనివాసులు తన ఆఫీస్ లో లంచంగా డిమాండ్ చేసిన 11వేలల్లో 6వేల రూపాయలు తీసుకోగానే దాడి చేసి పట్టుకున్నారు. నిందితుని నుంచి లంచంగా తీసుకున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరిచి జైలుకు రిమాండ్ చేశారు.
Also Read: Bondi Beach Attack: బోండీ ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల్లో ఒకరిది హైదరాబాద్.. సంచలన ప్రకటన

