Hydraa: శామీర్‌పేట్‌లో హైడ్రా కూల్చివేతలు.. ఆక్రమణలు తొలగింపు
Hydraa (imagecredit:swetcha)
రంగారెడ్డి, హైదరాబాద్

Hydraa: శామీర్‌పేట్‌లో హైడ్రా కూల్చివేతలు.. ఫ్రెండ్స్ కాలనీలో ఆక్రమణలు తొలగింపు

Hydraa: శామీర్‌పేట్ మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ కాలనీలో గురువారం హైడ్రా(Hydraa) అధికారులు కూల్చివేతలు చేపట్టారు. గత సుమారు 30 ఏళ్లుగా 20 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డును కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మించడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన హైడ్రా సీఐ మల్లేశ్వర్(CI Mallesh) ఆధ్వర్యంలో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆక్రమిత రోడ్డుపై నిర్మించిన ప్రహరీ గోడను తొలగించారు. ఈ చర్యతో కాలనీలో రాకపోకలకు అడ్డంకులు తొలగిపోయాయని స్థానికులు తెలిపారు. ప్రభుత్వ భూములు, రోడ్ల ఆక్రమణలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు కూడా అక్రమ నిర్మాణాలపై సమాచారం అందించాలని కోరారు.

Also Read: Tollywood Crisis: అందుకే సినిమాలు చూడలేకపోతున్నా.. ప్రముఖ నిర్మాత.. నీళ్లు కూడా దొరకవు..

దుర్గం చెరువు దుర్గంధం

మాధాపూర్ గుట్ట‌ల్లో ఉన్న దుర్గం చెరువు దుర్గంధంపై హైడ్రా ఫోకస్ చేసింది. చెరువులోకి నేరుగా మురుగు నీరు చేర‌డాన్నితీవ్రంగా ప‌రిగ‌ణించింది. దుర్గంచెరువులో గుర్ర‌పు డెక్క వ్యాప్తి చెంద‌డం, దుర్గంధంగా మార‌డంపై స్థానికుల నుంచి హైడ్రాకు వ‌చ్చిన ఫిర్యాదుల నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్(AV Ranganadh) మంగ‌ళ‌వారం దుర్గం చెరువును ప‌రిశీలించారు. చెరువులో స‌గ‌భాగం వ‌ర‌కూ గుర్ర‌పు డెక్క వ్యాపించడానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకున్నారు. ఎస్‌టీపీలు ఉన్న‌ప్ప‌టికీ వ‌ర‌ద కాలువ ద్వారా మురుగు నీరు నేరుగా దుర్గం చెరువులోకి క‌ల‌వ‌డం ప‌ట్ల క‌మిష‌న‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. జైళ్ల శాఖలో ఇద్దరు అధికారులకు ప్రమోషన్లు

Just In

01

Balagam Venu: వివాదంలో ‘ఎల్లమ్మ’ దర్శకుడు.. అలా చేసినందుకు హిందూ సంఘాలు ఆగ్రహం

Ponnam Prabhakar: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. మహాలక్ష్మిపై మంత్రి పొన్నం ప్రత్యేక ఫోకస్!

Akira Nandan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ డిప్యూటీ సీఎం కొడుకు.. ఎందుకంటే?

Hyderabad Crime: మైసమ్మగూడలో తీవ్ర కలకలం.. వ్యక్తిపై కత్తితో దాడి!

Realme Neo 8 Mobile: రియల్‌మీ నుంచి పవర్ ఫుల్ గేమింగ్ ఫోన్.. ఫీచర్లు చూస్తే మతిపోవడం పక్కా!