Hyderabad Metro Rail: మెట్రో రైలు సెక్యూరిటీగా ట్రాన్స్ జెండర్లు
Hyderabad Metro Rail (imagecredit:swetcha)
Telangana News, హైదరాబాద్

Hyderabad Metro Rail: మెట్రో రైలు సెక్యూరిటీ వింగ్‌లో ట్రాన్స్ జెండర్లు నియామకం!

Hyderabad Metro Rail: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్, రద్దీ సమస్యల నేపథ్యంలో నామమాత్ర ఛార్జీలకే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే హైదరాబాద్ మెట్రో రైలు సెక్యూరిటీ వింగ్ లో ట్రాన్స్ జెండర్లకు అవకాశం కల్పించింది. సిటీలోని మూడు కారిడార్లలో 57 స్టేషన్లతో డైలీ సుమారు 5 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. వీరిలో మహిళలు సుమారు 30 శాతం మంది ఉండగా, వారి భద్రత, సౌకర్యం, విశ్వాసం మెట్రో రైలు వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిందని చెప్పవచ్చు.

ప్రత్యేక శిక్షణ పూర్తి

తెలంగాణ ప్రభుత్వ సమానత్వం, గౌరవం, సమాన అవకాశాల దృష్టితో, వివిధ ప్రజా సేవా రంగాల్లో ట్రాన్స్‌జెండర్(Transgender) సిబ్బంది నియామకానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తుండగా, హైదరాబాద్ మెట్రో రైలు(Hyderabad Metro Rail) కూడా మరో అడుగు ముంధుకేసి 20 మంది ట్రాన్స్‌జెండర్ సిబ్బందిని భద్రతా విభాగంలో నియమించింది. ప్రత్యేక శిక్షణ పూర్తి చేసిన ఈ సిబ్బంది, సోమవారం విధుల్లో చేరినట్లు హైదరాబాద్ మెట్రో రైలు వెల్లడించింది. ఈ చొరవతో మహిళా ప్రయాణికుల భద్రతా బలపడటమే కాకుండా, సామాజిక సాధికారతకు ప్రతీకగా నిలుస్తుంది. కొత్తగా నియమితులైన వారు , జనరల్, మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన కోచ్‌లలో భద్రతా చర్యలు చేపట్టింది.

Also Read: BL Santhosh: అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు.. పార్టీ నాయకులకు బీఎల్ సంతోష్ దిశానిర్దేశం!

ప్రయాణికులు సౌకర్యవంతం

ప్రయాణికులకు దిశానిర్దేశం చేయడం, సమాచారం, అవసరమైన సహాయం అందించడానికి అందుబాటులో ఉంటారని మెట్రో రైలు వెల్లడించింది. ప్రయాణికులు సౌకర్యవంతంగా, సురక్షితంగా వెళ్లేలా స్కానర్ కార్యకలాపాలను ఈ సిబ్బంది పర్యవేక్షిస్తారని మెట్రో రైలు వెల్లడించింది. స్ట్రీట్-లెవెల్, కాన్‌కోర్స్ భద్రతలో ఈ సిబ్బంది భాగస్వాములు కావాలని వెల్లడించింది. హైదరాబాద్ మెట్రో రైలు, ప్రయాణికులకు సురక్షితమైన, సమర్థవంతమైన మొబిలిటీని అందించడానికి కట్టుబడి ఉందని, ట్రాన్స్‌జెండర్ సిబ్బందిని భద్రతా విభాగంలో నియమించడంతో మహిళా ప్రయాణికుల భద్రతను మరింత పెరిగిందని మెట్రో రైలు వెల్లడించింది.

Also Read: Nayanam Series: వ‌రుణ్ సందేశ్ ఓటీటీ డెబ్యూ ‘న‌య‌నం’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Just In

01

Naga Vamsi: ఐబొమ్మ రవి.. వాడు మాకు రాబిన్‌హుడ్‌లా తయారయ్యాడు..

Harish Rao: విద్యుత్ శాఖలో ఆంధ్రా అధికారుల పెత్తనమేంది: హరీష్ రావు

Nitish Kumar Reddy: తొలి వన్డేలో నితీష్ రెడ్డిని ఎందుకు ఆడించలేదు?.. జట్టు కూర్పుపై మాజీ దిగ్గజం తీవ్ర విమర్శలు

Hyderabad Metro Rail: మెట్రో రైలు సెక్యూరిటీ వింగ్‌లో ట్రాన్స్ జెండర్లు నియామకం!

Gadwal News: హస్తగతం కోసం కాంగ్రెస్ ఆరాటం.. పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ పోరాటం