Nayanam Series: జీ 5, ప్రేక్షకులను ఎప్పటికప్పుడు మెప్పించేందుకు సిద్ధమైంది. ఈసారి, తెలుగు ఆడియెన్స్ కోసం వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో కూడిన ఒరిజినల్ సిరీస్ ‘నయనం’ను పరిచయం చేస్తోంది. ఈ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్ కోసం ఇప్పటికే సబ్స్క్రైబర్లలో ఉత్కంఠ నెలకొంది. ‘నయనం’ సిరీస్ డిసెంబర్ 19 నుంచి ప్రత్యేకం జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరో వరుణ్ సందేశ్ ఓటీటీలోకి అధికారికంగా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉన్న ఈ ఒరిజినల్ సిరీస్‌లో వరుణ్ సందేశ్ ‘డాక్టర్ నయన్’ అనే కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘నయనం’ ఫస్ట్ లుక్‌ను జీ 5 తాజాగా విడుదల చేసింది. పోస్టర్ గమనిస్తేనే, వరుణ్ సందేశ్ పాత్రలో ఎంతటి ఇంటెన్సిటీ, డార్క్ యాంగిల్ దాగి ఉన్నాయో అర్థమవుతోంది. ఈ సైకలాజికల్ సంక్లిష్టతతో కూడిన పాత్రను ఆయన పరిచయం చేయబోతున్నారు.
Read also-Samantha Wedding: రాజ్‌తో రెండో పెళ్లి!.. ఫొటోలు పంచుకున్న సామ్.. మాముల్గా లేవుగా..
కథాంశం
ఈ సిరీస్‌కు స్వాతి ప్రకాశ్ దర్శకత్వం వహించారు. ‘నయనం’ కథాంశం చాలా సున్నితమైందిగా, మనుషుల్లోని అంతరంగాన్ని తాకే విధంగా ఉంటుంది. వ్యక్తుల్లోని నిజ స్వభావానికి మరియు ఏదో ఒక లక్ష్యం కోసం తపించే తత్వానికి మధ్య ఉండే భావోద్వేగ సంఘర్షణను ఇందులో ప్రధానంగా చూపించారు. ఈ నేపథ్యం సైకో-థ్రిల్లర్ జానర్‌కు మరింత డెప్త్ తీసుకొస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.
Read also-Bigg Boss Telugu 9: ఇమ్మాన్యూయేల్ వ్యవహారంపై ఫైర్ అయిన రీతూ.. డీమాన్ పవన్ కాన్ఫిడెన్స్ ఏంటి భయ్యా..
వరుణ్ సందేశ్ కెరీర్‌లో సరికొత్త ప్రయాణం
తొలిసారిగా ఓటీటీలోకి అడుగుపెడుతున్న సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. “ఒక నటుడిగా నాకు ఇది నిజంగా సరికొత్త ప్రయాణం. ఇప్పటి వరకు నేను చేయనటువంటి విభిన్నమైన, సైకలాజికల్ డెప్త్ ఉన్న డాక్టర్ నయన్ పాత్రలో కనిపించబోతున్నాను. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ కావడం వల్ల ఈ పాత్రలోని సంక్లిష్టతను ఇంకాస్త బలంగా, డెప్త్‌గా చూపించే అవకాశం దొరికింది. డిసెంబర్ 19న జీ 5లో ప్రీమియర్ కానున్న మా ‘నయనం’ సిరీస్‌ను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను,” అని ఆయన అన్నారు.
