chilukuru Balaji Temple
క్రైమ్, హైదరాబాద్

chilukuru Balaji Temple | చిలుకూరు బాలాజీ అర్చకుడిపై దాడి.. అసలు కారణం ఇదే..!

chilukuru Balaji Temple | చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై దాడి సంచలనం రేపుతోంది. రెండు రోజుల క్రితమే అతనిపై దాడి జరిగితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఎస్ రంగరాజన్ కు చాలా పేరు, ప్రఖ్యాతలు ఉన్నాయి. అలాంటి రంగరాజన్ (chilukuru Balaji Temple)మీద ఎవరు దాడి చేశారు.. ఎందుకు చేశారనే ప్రశ్నలు అందరిలోనూ వస్తున్నాయి. దీనికి అసలు కారణాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. రెండు రోజుల క్రితం ఆయన ఇంటికి రామరాజ్యం సంస్థకు చెందిన 20 మంది వెళ్లారు. ఆలయ బాధ్యతలు వేరే వాళ్లకు అప్పగించి తమ సంస్థలో చేరాలని.. రామరాజ్యం స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

కానీ అందుకు రంగరాజన్ ఒప్పుకోలేదు. దీంతో అతని మీద వాళ్లు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రంగరాజన్ మీద దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన ఆయన కొడుకును కూడా ఆ వీడియోలో కొట్టారు. ఈ ఘటనపై రంగరాజన్ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడి చేసింది తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన కొవ్వురి వీర రాఘవ రెడ్డి బ్యాచ్ అని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే వీర రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో అసలు ఎవరీ వీర రాఘవరెడ్డి అని అంతా ఆరా తీస్తున్నారు. ఇతను కలిలో రామరాజ్యం స్థాపన అనే సంస్థను ఏర్పాటు చేశాడు.

 

Read Also:ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకు.. కొట్టి చంపిన తండ్రి..!

రామరాజ్యాన్ని ఏర్పాటు చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు. ఈ సంస్థ కోసం పదో తరగతి పాసైన యువకులను రిక్రూట్ చేసుకొని ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నాడని తెలుస్తోంది. ఇన్ని రోజులుగా ఇతని పేరు పెద్దగా బయటకు రాలేదు. ఇప్పుడు అర్చకుడిపై దాడి ఘటనతో రాఘవరెడ్డి గురించి అందరికీ తెలుస్తోంది.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?