BRS Party Joining: బీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు నేతలు
BRS Party Joining (imagecredit:swetcha)
రంగారెడ్డి, హైదరాబాద్

BRS Party Joining: ఎల్లంపేట్‌లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు నేతలు

BRS Party Joining: ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని కోనాయిపల్లి గ్రామంలో పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్(BRS) పార్టీ మహిళా నాయకురాలు నిశితారెడ్డి(Nishita Reddy) ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(MLA Chamakura Mallareddy) పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని కోనాయిపల్లి, మైసిరెడ్డిపల్లి, నూతన్ కల్ 22వ వార్డుకు నిశితారెడ్డిని బీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థిగా పోటీకి దించనున్నట్లు ఆయన ప్రకటించారు.

Also Read: Telangana Congress: ఉపాధి హామీ రక్షణే ధ్యేయంగా పర్యటనలు..పేదలకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ సమరశంఖం!

ఈ కార్యక్రమంలో..

కోనాయిపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంపై మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో, మేడ్చల్ ఆర్టీసీ డిపో మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించాలని సూచించారు. అలాగే గ్రామంలోని యువత కోసం ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చామకూర మహేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ భాస్కర్ యాదవ్, మండల అధ్యక్షులు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, డబిల్‌పూర్ పీఎసీఎస్ మాజీ ఛైర్మన్ సురేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వెంకటేష్, నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, రాజమల్లారెడ్డి, జీవన్, యూసుఫ్, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read: Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ క్రేజీ అప్డేట్.. ఇక ఫ్యాన్స్‌కి పండగే!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?