Hanuman Movie Entry Into OTT, But Only For Tollywood : టాలీవుడ్ హీరో తేజ సజ్జ హీరోగా యాక్ట్ చేసిన హిట్ మూవీ హనుమాన్. OTTలో ఈ మూవీ రిలీజ్ డేట్ ఆలస్యం అయింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేయలేదని గతంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. దర్శకుడు స్టేట్‌మెంట్ ఇచ్చిన కొన్ని రోజులకే.. హనుమాన్ మూవీ తాజాగా..హిందీ, తెలుగు వర్షన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ తన హిట్ సూపర్ హీరో చిత్రం అనుకున్నట్లుగా మహా శివరాత్రికి స్ట్రీమింగ్‌లో ఎందుకు రిలీజ్ కాలేదో కొద్ది రోజుల క్రితం చెప్పాడు. తాజాగా.. హనుమాన్ మూవీ ఎట్టకేలకు ZEE5లో మీ స్క్రీన్‌లపై చూడటానికి అందుబాటులోకి రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఈ వారం ప్రారంభంలో, OTT ప్లాట్ ఫారమ్ ZEE5 ఓ పోస్ట్ పెట్టింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందంటూ క్యాప్షన్ ఇచ్చింది. హనుమాన్ త్వరలో ZEE5లో ఇంగ్లీష్ సబ్ టైటిల్‌తో రాబోతున్నాడు. ఈ మూవీ తెలుగు వెర్షన్ ఇప్పుడు ZEE5 స్ట్రీమింగ్‌లో అందుబాటులో ఉందంటూ క్యాప్షన్ ఇచ్చారు. హనుమాన్ జియో మూవీస్‌లో కూడా టెలీకాస్ట్ చేస్తున్నారు. అయితే, ఇది తెలుగు, కన్నడ మరే ఇతర దక్షిణ భారతీయ భాషలో అందుబాటులో లేదు. ఇది Jio Cinemaలో హిందీలో మాత్రమే అదికూడా ఇంగ్లీష్ టైటిల్‌తో ప్రసారం అవుతోంది. హిందీ వెర్షన్ కూడా శనివారం రాత్రి 8 గంటలకు కలర్స్ సినీప్లెక్స్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను ప్రదర్శించింది.
Read More: అదంతా ఫేక్ న్యూస్, నేను బాగానే ఉన్నా.. అమితాబ్ క్లారిటీ
హనుమాన్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడా అని తెలుగు రాష్ట్రాల ఆడియెన్స్ రెండు నెలలుగా వెయిట్ చేస్తున్న వారి నిరీక్షణకు తెరపడింది. కానీ హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. క్లైమాక్స్ విజువల్స్ షేర్ చేసి మరి తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఈ మూవీలో హీరోగా నటించిన తేజ సజ్జా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే జీ5లోకి హనుమాన్ అందుబాటులోకి వచ్చింది. కానీ కొన్ని కండీషన్స్ మాత్రం అప్లై అవుతాయి. సబ్ స్క్రిప్షన్ ఉన్నా మీరు చూడలేరు. ఎందుకంటే… ఈ మూవీ చూడాలంటే జీ5లో ఖచ్చితంగా డబ్బులు చెల్లించాలి. దీంతో ఆడియెన్స్ ఫైర్ అవుతున్నారు.
ఇక హనుమాన్ OTT రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు అభిమానులను ఉద్దేశించి ప్రశాంత్ వర్మ గతంలో ప్రసంగించారు. హనుమాన్ OTT స్ట్రీమింగ్ ఆలస్యం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని.. మేము విషయాలను క్రమబద్ధీకరించడానికి వీలైనంత త్వరగా మీ ముందుకు తీసుకురావడానికి కష్టపడుతున్నామని.. ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మాకు మీ మద్దతు ఇవ్వండి అంటూ తన X ఖాతాలో రాసుకొచ్చారు.
Read More: నా మొగుడున్నా ఇలానే తిరిగేదాన్ని, వాణి సంచలన వ్యాఖ్యలు
ఇక ఇదిలా ఉంటే… హనుమాన్ మూవీ వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద ₹100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఓ గ్రామంలో అంజనాద్రి నేపథ్యంలో సాగే ఈ హనుమాన్ మూవీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌కి నాంది పలికాడు. ఈ మూవీలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, రాజ్ దీపక్ శెట్టి మరియు వినయ్ రాయ్ వంటి నటులు ఇందులో నటించారు. జనవరి 12న రిలీజైన ఈ మూవీకి ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది.
Get ready to unleash the superpowers within Hanumantha on your TV screens! 😎
Watch the World Premiere of #HanuMan first time in Hindi, only on Colors Cineplex and @jiocinema@PrasanthVarma @tejasajja123 @RKDStudios @Actor_Amritha @varusarath5#HanuManOnColorsCineplex pic.twitter.com/BCWpm6uF93
— Colors Cineplex (@Colors_Cineplex) March 16, 2024