Actress Vani Viral Comments : టాలీవుడ్ నటి సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే తన కూతురుతో కలిసి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ.. సురేఖావాణి తన కూతురితో కలిసి చేసే వీడియోలు ఎంత ట్రెండ్ అవుతాయో.. అంతే ట్రోల్స్ అవుతుంటాయి. తన కూతురితో వాణి చేసే ట్రిప్స్ మీద మరింతగా విమర్శలు గుప్పిస్తుంటారు నెటిజన్స్. అయితే ఇవన్నింటిపై వాణి స్పందిస్తూ ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో వారందరితో తన ఒపినియన్‌ని పంచుకుంది. ప్రస్తుతం నెట్టింట ఇదే హాట్‌టాఫిక్‌గా మారింది.
సురేఖావాణి తన అందాల కూతురు సుప్రితతో కలిసి లాంగ్ వెకేషన్లకు వెళ్తుంటుంది. అప్పుడప్పుడు అవుట్‌డోర్ షూటింగ్స్ ఉంటే సుప్రితతో సురేఖ తోడుగా వెళ్తుంది. దుబాయ్, గోవా అంటూ నిత్యం ట్రిప్స్ వేస్తునే ఉంటారు. వీరి వెకేషన్ ఫోటోలు ఎక్కువగా ట్రోలింగ్‌కి గురవుతుంటాయి. తాజాగా.. సురేఖ వాణి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రోలింగ్స్ మీద రియాక్ట్ అయింది. ఇంత ఖాళీగా ఉన్నారా…? నా పేరు చెప్పుకొని సంపాదిస్తున్నారా.? అని లైట్ తీసుకున్నానంటూ ట్రోలింగ్ గురించి సురేఖా వాణి చెప్పుకొచ్చింది.
Read More: వైవాహిక జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన నటి
ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వమని దేవుడికి గుండు చేయించుకున్నానని తన లేటెస్ట్ లుక్ గురించి సురేఖా వాణి తెలిపింది. ముందుగా ఈ లుక్ బాగుందని తన కూతురు సుప్రిత చెప్పి నాకు చాలా కాన్పిడెంట్‌ని పెంచిందని వాణి తెలిపారు. ఇక తాజాగా.. తనపై వస్తున్న ట్రోలింగ్స్‌పై స్పందించింది వాణి. మొగుడు పోయిన తరువాత ఫ్రీఢం పెరిగిందని అందుకే ఇలా తిరుగుతుంటుందని చాలామంది అంటుంటారు. కానీ..నాకు చిన్నప్పుడే పెళ్లి జరిగిపోయింది. అప్పుడు ఎక్స్‌పోజర్ లేదు. ఇప్పుడు ఆ ఎక్స్‌పోజర్ వచ్చింది. నా మొగుడున్నా.. ఇప్పటికి ఇలానే ఉండేదాన్ని అని సురేఖా వాణి చెప్పారు.
మొదట్లో ఈ ట్రోలింగ్‌లన్ని చూసిన తరువాత.. చాలా బాధగా అనిపించేది. కానీ.. ఇప్పుడు వాటిని అస్సలు పట్టించుకోవడం లేదు. ఓహో ఇలా కూడా అనుకుంటారా నా గురించి అని లైట్ తీసుకున్నా.. వాడెవడో అంటే మనం రియాక్ట్ అవడం ఎందుకు ఆ కామెంట్లు చూడటం ఎందుకని వదిలేశానని.. పిచ్చి నా కొడుకులు అని వదిలేస్తానని, అంతేకాకుండా వారి కామెంట్లను చూస్తే ఒక్కోసారి.. జాలి కలుగుతుంది. అంతేకాదు కొన్నిసార్లు వాటిని చూసి నేను నా కూతురు ఇద్దరం నవ్వుకుంటామంటూ వాణి ఎమోషనల్ చెప్పుకొచ్చింది.