It’s All Fake News, But I’m Fine, Amitabh Clarity : బాలీవుడ్ స్టార్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని వార్తలు వచ్చాయి. ముంబై కోకిలాబెన్ దవాఖానలో చికిత్స పొందుతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. 81 ఏళ్ల బిగ్‌బీ పేరుతో ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. అంతేకాదు.. కృతజ్ఞతతో అంటూ ట్యాగ్‌లో పేర్కొన్నారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ ఏడాదే తన మనికట్టుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ టైంలో తన పేజిలో అదే మ్యాటర్‌ని రివీల్ చేశారు.ఇక తన ఆరోగ్యం బాగాలేదని వస్తున్న వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక తాజాగా తనపై వస్తున్న రూమర్స్‌పై బిగ్‌బీ రియాక్ట్ అయ్యారు. తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలన్నీ ఫేక్ అని అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు. ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారని.. యాంజియోప్లాస్టీ చేశారని, ఆయన అస్వస్థతకు గురైనట్లు మార్చి 15 (శుక్రవారం) రోజున సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బిగ్ బి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఆయన పబ్లిక్ ప్లేస్‌లో సందడిగా కనిపించారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) ఫైనల్ మ్యాచ్‌కు సైతం హాజరయ్యారు.
Read More: నా మొగుడున్నా ఇలానే తిరిగేదాన్ని, వాణి సంచలన వ్యాఖ్యలు
థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో మాఝీ ముంబయి, టైగర్స్ ఆఫ్ కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌కు కుమారుడు అభిషేక్ బచ్చన్‌తో కలిసి అమితాబ్ హాజరయ్యారు. మ్యాచ్ చూసేందుకు వెళ్లిన ఆయన ఆరోగ్యం గురించి మీడియా వారు ప్రశ్నించగా…అందులో ఏ మాత్రం నిజం లేదని, తనపై వచ్చే ఆ వార్తలన్ని ఫేక్ అని స్పష్టం చేశారు. దీంతో బిగ్‌బీ అభిమానులు హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అమితాబ్ ఐఎస్‌పీఎల్ ఫైనల్స్‌లో హుషారుగా పాల్గొని సందడి చేశారు. క్రికెట్ దిగ్గజం సచిన్‌తో కలిసి మ్యాచ్‌ను ఆనందంగా వీక్షించారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సైతం ఎక్స్‌లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఇది చూసిన ఆయన అభిమానులు తనపై వస్తున్న రూమర్స్ వార్తలపై రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అరేయ్ సోషల్ మీడియా బాబులు మీకు వార్తలు దొరకకపోతే ఏవి పడితే అవి రాసుకుంటారా అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. ఇలాంటి వార్తల కోసం ఎందుకు ఇలా లేనిపోనివి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారంటూ నెటిజన్లు సైతం ఫైర్ అవుతున్నారు.