Kaleswaram DPR
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Kaleswaram: డీపీఆర్ రాకముందే బ్యారేజీల నిర్మాణానికి పర్మిషన్!

  • మహారాష్ట్రతో ఒప్పందం జరగకుండానే వాప్కోస్‌కు జీవో?
  • ఏడాదిన్నర తర్వాత మంత్రివర్గం ర్యాటిఫికేషన్
  • రీ డిజైన్‌పై కీలక అంశాల్లో లేని క్యాబినెట్ ఆమోదం
  • కమిషన్ ముందు అన్నింటికీ ఉన్నాయన్న కేసీఆర్, ఈటల, హరీశ్
  • విచారణలో కీలకంగా మారిన క్యాబినెట్ పత్రాలు
  • జస్టిస్ ఘోష్ కమిషన్‌కు ఆధారాల అందజేత?

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల


స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్

Kaleswaram: మేడిగడ్డ కుంగుబాటుతో మొదలైన కాళేశ్వరం కమిషన్ విచారణ కీలక ఘట్టానికి చేరుకున్నది. బ్యారేజీలకు డీపీఆర్ లేకుండానే పరిపాలన అనుమతులు ఇచ్చారా, క్యాబినేట్ నిర్ణయం లేకుండానే రీడిజైన్ పేరుతో మూడు బ్యారేజీలకు పనులు ప్రారంభించారా లాంటి అనేక డౌట్స్ ఉన్నాయి. పనులు మొదలు పెట్టిన తేదీలకు, పేపర్లపై ఉన్న అనుమతుల తేదీలకు తేడాలు ఉన్నట్లు తెలుస్తున్నది. మంత్రి వర్గం ఆమోదం లేకుండానే రీ డిజైన్ పేరుతో మేడిగడ్డకు పరిపాలన అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కొంత సమాచారం ఇవ్వగా, సీఎంవో కార్యాలయం మరిన్ని ఆధారాలు సమకూర్చి కమిషన్‌కు అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం.


ర్యాటిఫికేషన్‌తో సరిదిద్దారు

జీవో 212తో 2015 ఏప్రిల్ 13న డీపీఆర్ తయారు చేయాలని ఆదేశించారు. వాప్కోస్ సంస్థ 2016 జనవరి 17న ప్రభుత్వానికి అందజేసింది. ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డ వరకు మూడు బ్యారేజీలు లిఫ్టుల నిర్మాణానికి రూ.13,593 కోట్లు ఖర్చు అవుతుందని డీపీఆర్‌లో తెలిపారు. దీంతో ఈఎన్సీ నుంచి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ ప్రతిపాదనను 2016 మార్చి 1న రూ.2,594 కోట్లతో మొదటి జీవో ఇచ్చారు. అయితే, ఈ అనుమతులుకు మంత్రివర్గ ఆమోదం లేదు. డీపీఆర్‌కు అనుకూలంగా చకచకా పనులు ప్రారంభించారు. ఏడాదిన్నర తర్వాత ర్యాటిఫికేషన్ పేరుతో మంత్రి వర్గం ముందుకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అయితే, డీపీఆర్ ఇచ్చినట్లు, అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్లు ఎక్కడా లేదు. టెక్నికల్‌గా పరిశీలించినట్లు రికార్డులు లేవు. 2016 మార్చి 27న డీపీఆర్ అందజేసినట్లు ఇరిగేషన్ శాఖ చెబుతున్నది. కానీ, దీని కంటే ముందే బ్యారేజీల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది.

Read Also- New Rules: జర చూసుకోండి.. జూలై 1 నుంచి రూల్స్ మారాయ్

రీ డిజైన్‌పై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్

చేవేళ్ల – ప్రాణహిత ప్రాజెక్ట్ తుమ్మిడిహట్టి దగ్గర నిర్మించాలి. నీటి లభ్యత, మహారాష్ట్రతో ఎత్తు కిరికిరి అంటూ రీ డిజైన్ పేరుతో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా హౌజ్‌లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే, ఇదంతా బాగానే కనిపిస్తున్నా, క్యాబినెట్, పరిపాలన అనుమతుల్లో చకచకా నిర్ణయాలు, స్వీజ్ చాలెంజ్ పేరుతో కాంట్రాక్టులు అప్పగించడం వంటివన్నీ ఎస్టిమేషన్స్ భారీగా పెంచేందుకు మాత్రమే అని క్యాబినెట్ మినిట్స్‌లో గుర్తించినట్లు సమాచారం.

Read Also- BJP: తెలంగాణ బీజేపీలో చంద్రబాబు చక్రం తిప్పారా..?

Just In

01

IAS Shailaja Ramaiyer: కమిషనర్ శైలజా రామయ్యర్ కు కీలక బాధ్యతలు..?

Mahabubabad District: యూరియా టోకెన్ల కోసం కిక్కిరిసి పోయిన రైతులు.. ఎక్కడంటే..?

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Gadwal District: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం.. నది ప్రవాహంలో బాలుడు గల్లంతు

Bigg Boss 9 Telugu Promo: డబుల్ హౌస్ తో.. డబుల్ జోష్ తో.. ప్రోమో అదిరింది గురూ!