Manoranjan Festival: ప్రస్తుతం థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుంది. ముఖ్యంగా కరోనా తర్వాత థియేటర్ల కంటే ఓటీటీలపైనే ప్రేక్షకులు ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఒక్కసారి సబ్‌స్ర్కిప్షన్ తీసుకుంటే సంవత్సరం మొత్తం ఇంట్లోనే, ఫ్యామిలీ అంతా వచ్చిన సినిమా వచ్చినట్లు చూడొచ్చు. థియేటర్లకు వెళ్లడానికి, రావడానికి పెట్టే ఖర్చులతో సబ్‌స్ర్కిప్షన్ వచ్చేసింది. అదనంగా టికెట్ కొనాల్సిన అవసరం లేదు. అందుకే, థియేటర్లలో ఎలాంటి సినిమాలు వచ్చినా, ఓటీటీకి వచ్చే వరకు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.
దీంతో ఓటీటీల డిమాండ్ బాగా పెరుగుతుంది. థియేటర్లలో సినిమా డౌన్ అవుతుంది. మరి ఇలాంటి పరిస్థితులుంటే, ఒక ఓటీటీ నెల రోజుల పాటు అందులోని కంటెంట్‌ను ఫ్రీగా చూడవచ్చనే ఆఫర్ ఇస్తే జనాలు గమ్మునుంటారా? ఆ ఓటీటీ ఏదో తెలుసుకుని నెలరోజుల పాటు ఎంజాయ్ చేస్తారు కదా? అలా ఎంజాయ్ చేయమని ఇప్పుడు ఓ ఓటీటీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Ketika Sharma: కేతికా.. నీ పంట పండిందిపో! ‘అది ధ సర్‌ప్రైజ్’
భారత్‌లోనే అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయినటువంటి ZEE5 ఓటీటీ తన సబ్‌స్క్రైబర్లకు, సబ్ స్క్రైబర్లు కానివారికీ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ‘మనోరంజన్ ఫెస్టివల్’ పేరుతో ఈ మార్చి నెలని అద్భుతంగా మార్చడానికి సిద్ధమైంది. మార్చి 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ZEE5 లోని కంటెంట్‌ని ఉచితంగా వాడుకోవచ్చని ప్రకటించింది. ఇందులో అనేక బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలు, ఎమోషనల్ డ్రామాలు, కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్స్, హై-ఆక్టేన్ యాక్షన్ చిత్రాలన్నింటినీ ఉచితంగా చూడవచ్చంటూ అదిరిపోయే ఆఫర్‌ని ప్రకటించింది. సబ్‌స్ర్కిప్షన్‌తో పని లేకుండా కంటెంట్‌ని చూడవచ్చంటే.. కచ్చితంగా అందరూ ఈ ఆఫర్‌ని యూజ్ చేసుకుంటారని జీ5 భావిస్తోంది.
ZEE5 మనోరంజన్ ఫెస్టివల్‌తో ఎంతో మంది ఉచితంగా వినోదాన్ని పొందే అవకాశాన్ని కల్పించడంతో ప్రస్తుతం వీక్షకుల సంఖ్య బాగా పెరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ఫెస్టివల్ ద్వారా జీ5 మరింతగా తన సబ్ స్క్రైబర్లను ఎంటర్‌టైన్ చేయనుంది. నెల రోజుల పాటు జరిగే ఈ పండుగ స్పెషల్‌గా ‘రక్షా బంధన్, హడ్డీ, కిసి కా భాయ్ కిసి కి జాన్, ఉంచాయ్, కడక్ సింగ్, అటాక్ పార్ట్ 1, లవ్ హాస్టల్, ఛత్రివాలి, ఖిచ్డి 2: మిషన్ పాంతుకిస్తాన్ (హిందీలో), విక్రమ్ (తమిళంలో), సూపర్ శరణ్య, ప్రణయ విలాసం, క్వీన్ ఎలిజబెత్ (మలయాళంలో), బేబ్ భాంగ్రా పౌండే నే (పంజాబీలో), ఘోస్ట్ (కన్నడలో) వంటి ఎన్నో చిత్రాలను ఉచితంగా వీక్షించవచ్చని జీ5 ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ సందర్భంగా జీ5 ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి వినోదాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, ఎక్కువ వినోదాన్ని వీక్షకులకు అందించేందుకు మేం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం. ZEE5 మనోరంజన్ ఫెస్టివల్ ద్వారా ఇలా ఉచితంగా వినోదాన్ని అందించడం వెనుక మా లక్ష్యం ఏమిటో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుని, ఈ మార్చి అంతా సినిమాలని చూసి ఎంజాయ్ చేయాలని, ఈ హోలీకి జీ5 మనోరంజన్ ఫెస్టివల్ కుటుంబాన్ని ఒక చోటకు చేర్చి సెలబ్రేట్ చేయనుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Jyothika: ‘కంగువ’పై కామెంట్స్ చేశారు, కానీ కొన్ని చెత్త సినిమాలకు.. ఇచ్చిపడేసిన జ్యోతిక
SSMB29: అడ్డడ్డే.. రాజమౌళికి ఎంత కష్టం వచ్చింది.. ఇక టార్చరే!