Anvesh Controversy: ప్రపంచ యాత్రికుడికి కరాటే దెబ్బలు..
na-anceshana-case
ఎంటర్‌టైన్‌మెంట్

Anvesh Controversy: ప్రపంచ యాత్రికుడికి కరాటే దెబ్బలు.. వెధవ అంటూ ఫైర్ అయిన కళ్యాణి..

Anvesh Controversy: ప్రపంచ యాత్రికుడినంటూ.. ప్రపంచ దేశాలు తిరుగుతూ యూట్యూబర్ బాగా పాపులర్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగే ప్రతి విషయం పైనా తన దైన శైలిలో ప్రతి స్పందిస్తూ.. లక్షల మంది చందాదారులను సంపాదించుకున్నారు. తాజాగా శివాజీ చేసిన వ్యాఖ్యలకు అన్వేష్ కూడా స్పందించారు. అదే క్రమంలో అసలు ఏం సంబంధంలేని గరికిపాటి నరసింహ మూర్తిని కూడా ఇందులోకి తీసుకువచ్చారు. వీరిద్దరినీ అసభ్య పదజాలంతో తిడుతూ అన్వేష్ చేసిన వీడియో తెగ వైరల్ అయింది. దీంతో అన్వేష్ పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో దిగొచ్చిన అన్వేష్ ఇద్దరికీ కూడా క్షమాపణలు చెప్పారు. అయినా ఈ విషయం ఇక్కడితో ఆగలేదు. దీంతో అన్వేష్ వీడియోలు ద్వారా దేశ ప్రజలను తిట్టడం, మహిళలను యువతను కించపరుస్తూ మాట్లాడటం, గోమాతను, హిందువులను కూడా వదలకుండా తనకు ఇష్టం వచ్చిన విధంగా తిట్టాడు. దీనికి స్పందించిన బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణీ అన్వేష్ పై ఫైర్ అయ్యారు. ఓ వెధవ ఎక్కడో ఉంటూ భారత దేశాన్ని, ప్రజలను గోమాతను కించ పరుస్తూ మాట్లాడుతున్నాడు. ఆ వెధవకు ఎలాగైన బాద్ధి చెప్పాలి’ అంటూ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది.

Read also-Pawan Movie: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మూవీ ఫిక్స్..

సోషల్ మీడియా వేదికగా హద్దులు దాటి ప్రవర్తిస్తున్న ప్రముఖ యూట్యూబర్ అన్వేష్‌పై వరుసగా పోలీసు కేసులు నమోదవుతున్నాయి. కోట్లాది మంది ఆరాధ్య దైవమైన సీతాదేవి, ద్రౌపదిలపై అన్వేష్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. హిందూ దేవుళ్లను కించపరిచేలా వీడియోలు అప్‌లోడ్ చేసినందుకు అన్వేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో కూడా అన్వేష్‌పై కేసులు రిజిస్టర్ అయ్యాయి. విదేశీ యువతులకు భారత్‌లో రక్షణ లేదని, ఇండోనేషియాను చూసి భారత్ నేర్చుకోవాలని చెబుతూ దేశ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడటాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో అతని ఫాలోవర్లలోనే చీలిక వచ్చింది. దాదాపు పది లక్షల మంది ఫాలోవర్లు అన్వేష్‌ను అన్‌ఫాలో చేయడం గమనార్హం. కేవలం వ్యూస్ కోసమే దేవుళ్లను, దేశాన్ని కించపరుస్తున్నాడంటూ అతన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు ఎండగడుతున్నారు. యూట్యూబ్ లో దాదాపు రోజుకు నలభై వేల మంది చొప్పున అన్వేష్ చానల్ ను వీడుతున్నారు. దాదాపు 2.5 మిలియన్లు ఉండే వారు ప్రస్తుతం 2.1 మిలియన్లు వరకూ వచ్చింది. ఇలా అన్వేష్ పై వ్యతిరేకత కొనసాగుతోంది.

Read also-Purushaha: పాపం సప్తగిరి.. ‘పురుష:’ నుంచి హీరోయిన్ హాసిని సుధీర్‌ ఫస్ట్ లుక్!

Just In

01

Damodar Rajanarasimha: రాష్ట్రంలో కొత్త ఏడాదిలో‌ 4 కొత్త హాస్పిటల్స్: మంత్రి దామోదర రాజనర్సింహ

2026 Assembly Elections: ఫుల్ పొలిటికల్ హీట్.. 2026లో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు ఇవే

Kingdom Sequel Cancelled: ‘కింగ్డమ్ 2’ ఇక ఉండదంటూ వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

Vande Bharat Sleeper: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జనవరిలోనే వందే భారత్ స్లీపర్ సేవలు.. కేంద్రం ప్రకటన

India Bullet Train: దేశంలో బుల్లెట్ రైలు కల నెరవేరబోతోంది.. ప్రారంభం తేదీని ఖరారు చేసిన కేంద్రం