Yash Toxic: ‘కెజియఫ్’ ఫేమ్ రాకింగ్ స్టార్ యశ్ (Rocking Star Yash) హీరోగా గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) రూపొందిస్తున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Toxic: A Fairy Tale for Grown-Ups). కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాని హాలీవుడ్ స్థాయికి ధీటుగా రూపొందిస్తున్నట్లుగా మేకర్స్ చెబుతూ వస్తున్నారు. ఈ మధ్య ఈ సినిమాపై ఎలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయో తెలియంది కాదు. కొన్ని సార్లు.. అసలు ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వస్తే.. ఈ మధ్య ఈ సినిమా అనుకున్న డేట్‌కు విడుదల కాదు, మళ్లీ వాయిదా పడనుంది అంటూ ఒకటే వార్తలు. తాజాగా ఈ వార్తలకు చెక్ పెడుతూ చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది.
Also Read- Rahul Ravindran: ‘ది గర్ల్ ఫ్రెండ్’కు మొదట అనుకున్న హీరోయిన్ ఎవరంటే?
‘టాక్సిక్’ రిలీజ్ డేట్‌లో నో ఛేంజ్
ఈ సినిమా విడుదల వాయిదా పడనుందంటూ రూమర్స్ వచ్చిన నేపథ్యంలో.. ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ నిర్మాతలను సంప్రదించి విడుదల తేదీపై క్లారిటీ అడగడంతో.. ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమా రిలీజ్ డేట్‌పై వచ్చిన రూమర్స్‌పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సినిమా రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేదని, మొదట ప్రకటించినట్లుగానే ఈ సినిమా 19 మార్చి, 2026న (Toxic Release Date) ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదలవుతుందని ప్రకటించారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో భాగంగా విఎఫ్ఎక్స్ పనులు జరుపుకుంటోంది. మరో వైపు యష్ ముంబైలో ‘రామాయణ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ‘టాక్సిక్’ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభిస్తామని ఈ అప్డేట్‌లో మేకర్స్ తెలియజేశారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియా వేదికగా ఇంకా 140 రోజులు మాత్రమే ఉన్నాయంటూ.. ‘టాక్సిక్’ విడుదల తేదీని మరోసారి కన్ఫర్మ్ చేసింది.
ఫెస్టివల్ సీజన్ మొదలు..
మేకర్స్ ఈ చిత్ర విడుదల తేదీని మార్చి 19కి ఫిక్స్ చేయడానికి కారణం లేకపోలేదు. మెయిన్ ఫెస్టివల్స్ సీజన్ ‘గుడి పడ్వా, ఉగాది’ సహా ప్రాంతీయ నూతన సంవత్సర వేడుకలు ఒకేసారి రానున్న సందర్భంగా ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. వీటితో పాటు ఈద్ పండుగ కూడా ఉండటంతో.. ఆ టైమ్‌లో బాక్సాఫీస్ దగ్గర సినిమా భారీ ప్రభావం చూపనుందని మేకర్స్ భావిస్తున్నారు. కెజియఫ్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత యష్ నటిస్తోన్న సినిమా కావడంతో ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’పై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు ఉన్నాయి. మరి ఈ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో? లేదో? తెలియాలంటే మాత్రం మార్చి వరకు వెయిట్ చేయాల్సిందే.
140 days to go…
His Untamed Presence,
Is Your Existential Crisis.#ToxicTheMovie releasing worldwide on 19-03-2026 https://t.co/9RC1D6xLyn— KVN Productions (@KvnProductions) October 30, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
