Rahul Ravindran: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna), ‘దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి (Dheekshith Shetty) జంటగా నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend). నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకుడు. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలు. సరికొత్త ప్రేమ కథగా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టింది. తాజాగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమా విశేషాలకు మీడియాకు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..
ఓటీటీకి వద్దు.. సినిమానే చేద్దాం
‘‘కాలేజ్‌లో చదివే సమయంలో చూసిన ఒక ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమా కథ రాశాను. అప్పట్లో వచ్చిన ఓ పాట కూడా నన్ను ఈ కథ రాసేందుకు స్ఫూర్తి. ఇలా టైమ్ కుదిరినప్పుడల్లా కొన్ని స్క్రిప్ట్స్ రెడీ చేసుకున్నాను. ఆహా ఓటీటీ వాళ్లు మాకొక ప్రాజెక్ట్ చేయండి అని అడిగినప్పుడు వారికి ‘ది గర్ల్ ఫ్రెండ్’ కథ పంపాను. నేను, రష్మిక, గీతా ఆర్ట్స్ కాంబినేషన్‌లో ఒక సినిమా చేయాల్సి ఉంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ కథను అల్లు అరవింద్ చదివి.. ఇది ఓటీటీకి కాదు.. దీంట్లో సినిమాకు కావాల్సిన కంటెంట్ ఉంది. కాబట్టి.. ఓటీటీకి వద్దు.. సినిమానే చేద్దామని చెప్పారు. రష్మిక, మా కాంబోలో మొదట అనుకున్న కథ పక్కనపెట్టి ఈ కథనే సినిమాగా మొదలుపెట్టాం.
Also Read- Tollywood: టాలీవుడ్‌లో పవన్ నామ స్మరణ.. వారికి వరమా? శాపమా?
సమంతానే సజెస్ట్ చేసింది
అలా అనుకున్న తర్వాత స్క్రిప్ట్‌ను రష్మికకు పంపడం జరిగింది. ఆమె మొత్తం చదివిన తర్వాత చెప్తానంది. రెండు రోజుల్లోనే స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్‌గా చదివి కాల్ చేసి.. మనం ఈ మూవీ చేస్తున్నామని చెప్పింది. ఇలాంటి కథ ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఒక అమ్మాయిగా నేను ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యాను.. బయట ఉన్న అమ్మాయిలందరికీ నేను ఇచ్చే బిగ్ హగ్ ఈ సినిమా అని చెప్పడంతో.. ఈ సినిమా మొదలైంది. వాస్తవానికి నేను ఏ కథ రాసుకున్నా.. ముందుగా నా స్నేహితులు సమంత, వెన్నెల కిషోర్, అడివి శేష్, డైరెక్టర్ సుజీత్.. ఇలా కొంతమందికి పంపిస్తుంటాను. అలా ‘ది గర్ల్ ఫ్రెండ్’ కథను కూడా పంపాను. అలా సమంతకు కూడా పంపించాను. మొదట ఈ సినిమాలో సమంత హీరోయిన్ అనేలా వార్తలు కూడా వచ్చాయి. కానీ, సమంత ఈ స్క్రిప్ట్ చదివాక.. ఈ కథకు నేను కాదు, మరొక హీరోయిన్ అయితేనే ఈ మూవీకి బాగుంటుందని సలహా ఇచ్చింది.
Also Read- Raju Weds Rambai: ‘ఆర్ఎక్స్ 100’, ‘బేబి’.. ఆ జాబితాలోకి చేరే సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’
ఆ ధైర్యం చేయను
అదే టైమ్‌లో రష్మిక మందన్నా ‘యానిమల్’ సినిమా విడుదలై వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తున్నప్పుడు నాకు కొంచెం భయమేసింది. రష్మికను ఇంత రియలిస్టిక్‌గా చూపిస్తున్నాం, అక్కడేమో ‘యానిమల్’ సినిమా ప్రేక్షకులపై మరో ఇంప్రెషన్ వేస్తోందని భయపడుతున్న సమయంలో.. రష్మిక నా అనుమానాన్ని తెలుసుకుని, ఈ కథకు మీరు నన్ను ఇలాగే స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలి, మీరు ఎలా అయితే అనుకున్నారో.. అలాగే రియలిస్టిక్‌గా నా క్యారెక్టర్ కనిపించాలని నాలో ఉన్న భయాన్ని పోగొట్టింది. ట్రైలర్‌లో ఉన్న హై వోల్టేజ్ ఇంటెన్స్ డ్రామా అంతా సెకండాఫ్‌లో ఉంటుంది. ఒక జంట లైఫ్‌లో ఇలా జరిగిందనేది నాకు తెలిసిన పద్ధతిలో చూపించాను. అంతే కానీ, ఇందులో ఎలాంటి సందేశాలు, నీతులు చెప్పలేదు. సినిమా చూసి ఆడియెన్స్ ఆలోచించుకుంటారనే నమ్మకం ఉంది. నేను ఈరోజు మంచిది అనుకున్నది ఐదేళ్ల తర్వాత మంచిది కాదని నాకే అనిపించవచ్చు. అందుకే ఎవరికీ మెసేజ్‌లు ఇచ్చే ధైర్యం చేయను. ఇంటెన్స్ ఎమోషన్ ఉన్న లవ్ స్టోరీని రియలిస్టిక్ అప్రోచ్‌లో చేశాం. ఈ సినిమా తర్వాత నేను డైరెక్ట్ చేయబోయే రెండు సినిమాలు ఓకే అయ్యాయి. అందులో ఒకటి మళ్లీ రష్మికతోనే ఉంటుంది. త్వరలోనే ఆ వివరాలు తెలియజేస్తాను’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
