Raju Weds Rambai: అఖిల్ (Akhil), తేజస్విని (Tejaswini) జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju Weds Rambai). ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోంది. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి (Saailu Kampati) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం నవంబర్ 21న.. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కార్యక్రమాన్ని మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.
మనసుకు హత్తుకున్న చిత్రం
ఈ కార్యక్రమంలో నిర్మాత బన్నీ వాస్ (Bunny Vas) మాట్లాడుతూ.. ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా చూశాను. నా మనసుకు హత్తుకున్న చిత్రమిది. కొందరి జీవితాలలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ఇది కాల్పనిక కథ అయితే మాత్రం అంతా ఆ దర్శకుడి ఊహకు ఆశ్చర్యపోయేవాళ్లం. ఇలా ఎలా ఆలోంచించారని అనుకునేవాళ్లం. ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు గ్యారంటీగా ఒక ఎమోషనల్ ఫీల్‌తో వస్తారు. రాజు పాత్రలో అఖిల్ బాగా నటించాడు. తేజస్విని మన తెలుగు అమ్మాయి. ఈ సినిమాలో తన స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. హీరో సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ చైతన్య జొన్నలగడ్డ ఇందులో ఒక మంచి రోల్ చేశాడు. అతనికి నటుడిగా మంచి పేరు తెచ్చే మూవీ అవుతుందని భావిస్తున్నాను. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఆయనతో పాటు ఈటీవీ విన్ వారికి మంచి విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
Also Read- Malavika Mohanan: చిరు-బాబీ సినిమాలో.. క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్ హీరోయిన్!
ఆ సినిమాల్లా గుర్తుండిపోతుంది
ప్రొడ్యూసర్ వేణు ఊడుగుల (Venu Udugula) మాట్లాడుతూ.. ఖమ్మం, వరంగల్ మధ్య నిజంగా జరిగిన ఓ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ చిత్ర కథను దర్శకుడు సాయిలు రాసుకున్నాడు. ప్రేమతో కూడిన విషాధభరితమైన ఈ సంఘటన ఆ ఊర్లోనే జరిగి.. అక్కడే సమాధి అయ్యింది. ఆ సంఘటనను బేస్ చేసుకుని సాయిలు ఒక మంచి స్క్రిప్ట్ రాశాడు. ఈ కథ విన్నప్పుడే మనసును కదిలించింది. ఈ కథను ఎంటర్‌టైనింగ్, మాస్ అప్పీల్ ఉండేలా దర్శకుడు సాయిలు స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఈటీవీ విన్ వారి వల్లే నేను నిర్మాతనయ్యాను. నవంబర్ 21న ‘రాజు వెడ్స్ రాంబాయి’ రిలీజ్ అవుతుంది. ‘7బైజి బృందావన్ కాలనీ, ప్రేమిస్తే, ఆర్ఎక్స్ 100, బేబి’ వంటి చిత్రాల్లా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇదవుతుందని కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. నా డైరెక్షన్‌లో త్వరలో యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేయబోతున్నాను. ఆ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ప్రస్తుతం జరుగుతోందని తెలిపారు.
Also Read- Bigg Boss Telugu 9: రీ ఎంట్రీలో షాకింగ్ ట్విస్ట్.. భరణికి ఏమైంది?
ఒకే ఒక్క నెరేషన్‌లో
చిత్ర దర్శకుడు సాయిలు కంపాటి మాట్లాడుతూ.. చిన్నప్పుడు మా ఇంట్లో టీవీ లేకుంటే.. వేరే వాళ్ల ఇంటి కిటికీలో నుంచి సినిమాలు చూసేవాళ్లం. ఈ రోజు నేను డైరెక్ట్ చేసిన సినిమా.. అదే టీవీ ప్రొడక్షన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2016 నుంచి ఈ కథ పట్టుకుని ఇండస్ట్రీలో తిరుగుతున్నాను. ఒకే ఒక్క నెరేషన్‌లో వేణు ఊడుగుల.. మనం సినిమా చేస్తున్నాం తమ్ముడూ అన్నారు. ఈటీవీ విన్ వారిని అప్రోచ్ అయితే.. వాళ్లకూ కథ నచ్చింది. అలా ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా టేకాఫ్ అయ్యింది. సాయికృష్ణ, నితిన్ నాకు బ్రదర్స్‌లా ఈ సినిమాకు సపోర్ట్ చేశారు. వేణు అన్న తోడునీడలా ఉన్నారు. సురేష్ బొబ్బిలి అన్న మ్యూజిక్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు మాట్లాడారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
