Yash Introduced as Raya: ‘రాకింగ్ స్టార్’ యష్ పుట్టిన రోజు సందర్భంగా టాక్సిక్ సినిమా నుంచి హీరో ఇంట్రడక్షన్ విడుదల చేశారు. ఇందులో యాష్ రాయ గా పరిచయం అవుతున్నారు. గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు KVN ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కేజీఎఫ్ 2 సినిమా తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు పెట్టకున్నారు అభిమానులు. ఇప్పటికే ఈ సినిమా నుంచి అయిదుగురు హీరోయిన్లను పరిచయం చేశారు. తాజాగా యష్ పాత్ర ‘రాయ’ ను పరిచయం చేస్తూ వీడియో విడుదల చేశారు. దీనిని చూస్తుంటే సినిమా పేరుకు తగ్గట్లుగా ఉంది. ఇప్పటికే కియారా అద్వానీ, నయన తార, రుక్మిణీ వసంత్, హుమా ఖురేషి, తార సుతారియా వంటి హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. రవి బస్సూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కులకర్ణి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చ్ 19, 2026న విడుదల కానుంది.
Read also-The Raja Saab: ‘ది రాజా సాబ్’కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. బెనిఫిట్ షో టికెట్ ధర వింటే షాకే!
ఇంట్రో ఎలా ఉందంటే?
యష్ ఇంట్రడక్షన్ షాట్ చూస్తుంటే.. సమాధుల దగ్గర్ ఎవరికో నివాళులు ఇవ్వడానికి కొందరు సిద్ధం అవుతుంటారు. వారకి రక్షణగా కొందరు అనుచరులు అక్కడ తిరుగుతుంటే అక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఎలా అంటే తుఫాను వచ్చే ముందు ఎలా ఉంటుందో అలా. అదే సమయంలో ఓ రాయల్ కార్ వచ్చి చెట్టుకు గుద్దుకుంటుంది అందులో నుంచి మాస్ లుక్ మందు తాగుతూ దిగుతాడు. దీనిని చూసిన అక్కడి వారు ఎవరో తాగుబోతు అనుకుంటారు. కారు దిగిన వ్యక్తి మాత్రం ఏదో చేస్తూ కనిపిస్తాడు. ఏం చేస్తున్నావు అని అడిగినా సమాధానం మాత్రం చెప్పకుండా బాంబుకు బ్యాటరీ కనెక్షన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత బాంబు పేలుతుంది. అప్పుడే కారులోంచి యష్ దిగుతాడు.. అక్కడ ఉన్న వారిని కొంత మందిని చంపి.. డాడీ ఈజ్ హోమ్ అంటూ చెప్తుడు. అక్కడ కారులో ఏం జరిగింది అన్నది చాలా ఆసక్తిగా ఉంటుంది. కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టకున్నారు. ఈ షాట్ చూస్తేనే తెలుస్తోంది, ఈ సినిమా కూడా వేరే లెవెల్ లో ఉండబోతుందని. దీనిని చూసిన యష్ ఫ్యాన్ పుట్టిన రోజుకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు అంటూ నిర్మాతలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మొదటి పరిచయం వీడియోనే ఇలా ఉంటే సినిమా ఎంత టాక్సిక్ గా ఉండబోతుందో అని అభిమానులు అంచనాలు వేస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే కనీసం ట్రైలర్ వచ్చే వరకూ ఆగాల్సిందే.
Read also-Megastar Song: మెగాస్టార్ ‘హుక్ స్టెప్’ ఇరగదీశాడుగా.. ఫుల్ లిరికల్ వీడియో ఎలా ఉందంటే?

