Megastar Song: మెగాస్టార్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా జనవరి 12, 2026న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే దాదాపు ప్రమోషన్లు కూడా పూర్తి చేశారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా కూడా నిర్వహించారు. ఇదే సందర్భంలో బాస్ సినిమా నుంచి మరో లిరికల్ ‘హుక్ స్టెప్ సాంగ్’ విడుదలైంది. తన డాన్స్ తో ప్రేక్షకుల హృదయాలు దోచుకునే మెగాస్టార్ ఈ పాటలో కూడా తనదైన శైలిలో స్టెప్పులు ఇరగదీశారు. దానికి తోడు భీమ్స్ అందించిన సంగీతం ఈ పాటకు మరింత ప్లెస్ పాయింట్ అయింది. ప్రస్తుతం ఈ హుక్ స్టెప్ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ పాటను సినిమా మొదటిలోనే చిత్రీకరించినా.. రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చాకా పాటను విడుదల చేశారు. దీనిని చూసిన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మెగాస్టార్ ఈస్ బేక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Read also-Jana Nayagan Postponed: సంక్రాంతి బరినుంచి తప్పుకున్న విజయ్ దళపతి.. ‘జన నాయగన్’ రిలీజ్ వాయిదా..
హుక్ స్టెప్ వేరే లెవెల్..
దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవిని వింటేజ్ లో ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే చూపించారు. ఇప్పటికే విడదులైన ప్రచార చిత్రాలు చూస్తుంటే మళ్లీ బాస్ ఈస్ బ్యాక్ అవుతాడు అనిపిస్తుంది. ఈ వయసులో కూడా ఆయన వేసే స్టెప్పులు అందరినీ ఆశ్యర్య పరుస్తున్నాయి. చిరు సినిమాల్లో పాటలకు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కూడా అదే ప్రూ అయింది. చిరు స్టెప్పులకు తోడు భీమ్స్ అందించిన సంగీతం సినీమాకూ పెద్ద ప్లుస్ పాయింట్. ఇప్పటికే సినిమా అన్నిప్రచారం కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. తాజాగా విడుదల చేసిన హుక్ స్టెప్ అందిరినీ అలరిస్తుంది. సినిమా విడుదల కోసం మెగాస్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బోళా శంకర్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని మెగాస్టార్ ఈ సినిమా తీస్తుండటంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.
Read also-Megastar Chiranjeevi: రామ్ చరణ్‌కు ఏదయితే చెప్పానో.. సుస్మితకు కూడా అదే చెప్పా..
సెన్సార్ పూర్తి..
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్, పాటలు సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు అన్ని రకాలుగా సిద్ధమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. సెన్సార్ నుంచి ఈ సినిమాకు యుబైఏ సర్టిఫికెట్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా నిడివి విషయానికి వస్తే.. 162 నిమిషాలు, అంటే 2 గంటల 42 నిమిషాలు అని తెలుస్తోంది. మొత్తంగా అయితే సెన్సార్ టాక్ మాత్రం చాలా పాజిటివ్‌గా ఉందని మాత్రం క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి హిట్ ఎంత అవసరమో తెలియంది కాదు. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు మెగా అభిమానులు.

