The Raja Saab: ‘ది రాజాసాబ్’ నార్త్ ప్రమోషన్లపై నిర్మాత క్లారిటీ..
the-rajasab-pramotions
ఎంటర్‌టైన్‌మెంట్

The Raja Saab: ‘ది రాజాసాబ్’ నార్త్ ఇండియా ప్రమోషన్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత విశ్వ ప్రసాద్..

The Raja Saab: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 8 ప్రీమియర్ జరగనుంది. ఈ ప్రీమియర్ కు ముందు జరిగిన ఓ ప్రేస్ మీట్ లో సినిమా నార్త్ ఇండియా ప్రమోషన్ గురించి ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. అసలు ఎందుకు నార్త్ ప్రమోషన్లు జరగలేదు అనుకుంటున్న రెబల్ అభిమానులకు దీంతో ఓ క్లారిటీ వచ్చింది. దీని గురించి నిర్మాత ఏం చెప్పారంటే.. ప్రతి సినిమాకు కొన్ని నామ్స్ ఉంటాయని అవి నార్త్ లో చూసుకుంటే చాలా పాజిటివ్ గా అనిపించాయని ప్రభాస్ అంటేనే బజ్ క్రియేట్ అవుతుందని దాంట్లోనూ ప్రభాస్ ప్రమోషన్లకు దూరంగా ఉంటారు. రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాకు మాత్రమే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారని, అది తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ఈ సినిమా నార్త్ లో ఎన్ని థియేటర్లలో విడుదల అవుతుంది అన్న ప్రశ్నకు దాదాపు నాలుగు వేల థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Read also- Megastar Song: మెగాస్టార్ ‘హుక్ స్టెప్’ ఇరగదీశాడుగా.. ఫుల్ లిరికల్ వీడియో ఎలా ఉందంటే?

అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్లు బాగా చేశామని, గత మూడు నాలుగు నెలల నుంచి సినిమాను ఏదో విధంగా ప్రజల్లో ఉంచామంటూ చెప్పుకొచ్చారు. దీంతో చాలా మంది ఫ్యాన్ ఈ సినిమా నార్త ప్రమోషన్లు విషయంలో అసలు కేర్ తీసుకోవడంలేదు అనడానికి సమాధానం దొరికింది. గత ఏడాది నుంచి ఈ సినిమా ప్రమోషన్లు జరుగుతున్నాయని, మోడరేట్ నుంచి బెటర్ ప్రమోషన్లు అయితే జరిగాయని అందరూ సినిమా గురించి చాలా ధీమాగా ఉన్నామని, చెప్పుకొచ్చారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కూడా కల్పించింది. ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా మల్టీఫ్లెక్సుల్లో రూ.1000, సింగిల్ థియోటర్లలో రూ.800 చొప్పున ప్రీమియర్ టికెట్లు పెంచుకునే అవకాశం కల్పించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. ఈ సినిమా విడుదల కోసం అభిమానుల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

Read also-Seetha Payanam: ‘అస్సలు సినిమా’ ముందుందంటోన్న అర్జున్ కుమార్తె..

 

Just In

01

The RajaSaab Review: రెబల్ సాబ్ ‘ది రాజాసాబ్’తో ఎంతవరకూ మెప్పించారు?.. ఫుల్ రివ్యూ..

Hyderabad Police: ఆహార కల్తీని హత్యాయత్నంగానే పరిగణిస్తాం.. వారికి సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్!

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుదాం..ఇంకో 8 ఏళ్లు మనదే అధికారం : సీఎం రేవంత్ రెడ్డి!

CM Revanth Reddy: వైఐఐఆర్‌సీ మొద‌టి విడుత‌లో బాలిక‌ల‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి : సీఎం రేవంత్ రెడ్డి!

Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ పాపాలే.. తెలంగాణకు శాపం.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు!