Music Director Koti: సింగర్ ప్రవస్తి వివాదం రోజు రోజుకు ముదురుతోంది. అసలు ఎవరూ ఉహించని విధంగా ఆ అమ్మాయి మీడియా ముందుకొచ్చి ” పాడుతా తీయగా ” షో గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆ షో కి జడ్జెస్ గా వ్యవహరిస్తున్న స్టార్ సింగర్స్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో, ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ అమ్మాయి చెప్పినవి విన్న తర్వాత సింగింగ్ ఇండస్ట్రీలో ఇంత జరుగుతుందా అనే సందేహాలు వస్తున్నాయి. అయితే, తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ కోటి సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశాడు.
ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో వైరల్ అవుతుంది.
Also Read: Telangana Police Jobs: నిరుద్యోగులు రెడీగా ఉండండి.. తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల జాతర
మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూ ” హలో గీతా కృష్ణ గారు. మీరు నాకు బాగా నచ్చిన డైరెక్టర్. అప్పట్లో మీరు అంటే ఒక గౌరవం ఉండేది. ఇప్పుడు కూడా ఉంది. మీరు కొత్త రకమైన ఆలోచనలతో కొత్తగా సినిమాలు చేశారు. అలాగే మీకు మంచి పేరు ఉంది ఇండస్ట్రీలో , చాలా చక్కటి డైరెక్టర్, కె. విశ్వనాధ్ దగ్గర నేర్చుకుని వారిలో ఫేమ్ అయిన డైరెక్టర్స్ లో మీరు ఒక్కరే. కానీ, ఈ మధ్య మీరు కొంచం ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కీరవాణి గురించి కానీ, సునీత గురించి కానీ, ఏదేదో మాట్లాడుతున్నారు. మేము అంతా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ. తప్పు ఏం జరిగిపోలేదు. ఆ గోడవేదో వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. ఆ గోల ఏంటో కూడా మనకీ తెలియదని అన్నాడు.
Also Read: Singer Pravasthi: ప్రవస్తి చెప్పేదంతా నిజమే.. ఆ డైరెక్టర్ సంచలన కామెంట్స్
ఆయన ఇంకా మాట్లాడుతూ ఇలా వ్యక్తిగతంగా మాట్లాడి అవమానించడం ఎంత వరకు కరెక్ట్.. మీరు నాకు ఒక బ్రదర్ లాంటి వాళ్ళు. నేను కూడా మీకు చాలా ఇష్టం. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఆ షో బాగానే జరుగుతుంది. షో అన్నాక గొడవలు జరగకుండా ఉంటాయా? చిన్న చిన్నవి వస్తుంటాయి. అవి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. దీన్ని ఇంకా రచ్చ చేయకండి. వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడకండి. ప్లీజ్ ప్లీజ్ .. కీరవాణి గురించి తప్పుగా మాట్లాడకండి. అతను ఎంత కష్ట పడితే ఈ స్టేజిలో ఉన్నాడో నాకు బాగా తెలుసు. ప్లీజ్ గీతా కృష్ణ గారు ప్లీజ్ వదిలేయండి ఇక్కడితో.. ఆయన మాటల్లో చెప్పుకొచ్చాడు.